Begin typing your search above and press return to search.

న‌య‌న్..శ్రుతిహాస‌న్ తో లారెన్స్ రొమాన్స్

అయితే ఈసారి లారెన్స్ ఏకంగా త‌న‌కు జోడీగా సూప‌ర్ భామ‌ల్నే రంగంలోకి దించుతున్న‌ట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   3 Feb 2024 3:00 AM GMT
న‌య‌న్..శ్రుతిహాస‌న్ తో లారెన్స్ రొమాన్స్
X

రాఘ‌వ లారెన్స్ కి చాలా కాలంగా స‌రైన హిట్ లేదు. చేసిన ప్ర‌య‌త్నాలేవి ఫ‌లించ‌డం లేదు. 'చంద్ర ముఖి-2` తో భారీ విజ‌యం అందుకోవ‌చ్చని భావించినా లారెన్స్ ఆశ‌ల‌న్నీ ఎలా కూలిపోయాయో తెలిసిందే. దీంతో లారెన్స్ కిప్పుడు విజ‌యం అవ‌స‌రం. అందుకే మరోసారి త‌న‌కు క‌లిసొచ్చిన హార‌ర్ థ్రిల్ల‌ర్ జాన‌ర్ నే ట‌చ్ చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. `రైడ్`..`రాక్ష‌సుడు` లాంటి హిట్ చిత్రాలు తెర‌కెక్కించిన ర‌మేష్ వ‌ర్మ‌తో ఓ సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నాడు.

'శ్రీరామ‌ర‌క్ష` అనేది ఈ సినిమా టైటిల్ గా తెలుస్తోంది. ఇది హార‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న చిత్రం. ఈనెల 14న సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ డ‌నుంది. అయితే ఈసారి లారెన్స్ ఏకంగా త‌న‌కు జోడీగా సూప‌ర్ భామ‌ల్నే రంగంలోకి దించుతున్న‌ట్లు తెలుస్తోంది. న‌య‌న‌తార‌-శ్రుతి హాస‌న్ లి హీరోయిన్ల‌గా తీసుకునే ప్లాన్ లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఇంత‌వ‌ర‌కూ వీరిద్ద‌రు లారెన్స్ తో న‌టించ‌లేదు.

హార‌ర్ జాన‌ర్ సినిమాల కోసం లారెన్స్ కూడా పెద్ద హీరోయిన్ల జోలికి వెళ్లింది లేదు. త‌న ఇమేజ్ కి త‌గ్గ హీరోయిన్ల‌నే తీసుకుని సూప‌ర్ స‌క్సెస్ లు అందుకున్నాడు. కానీ ఈసారి ఇద్ద‌రు టాప్ హీరోయిన్లు తీసుకొ చ్చే ప‌నిలో ప‌డ‌టంతో సినిమాని ఎంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్నారో తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఇలాంటి జాన‌ర్ ని సౌత్ లో శ్రుతిహాస‌న్ ట‌చ్ చేయ‌లేదు. న‌య‌న‌తార సోలోగా ఈ త‌ర‌హా ప్ర‌య‌త్నాలు చేసింది గానీ అంత‌గా ఆక‌ట్టుకోలేదు.

ఈ సారి మాత్రం వీరిద్ద‌రు లారెన్స్ తో కలిసి భ‌య‌పెట్ట‌డానికో..భ‌య‌ప‌డటానికో రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోం ది. ప్ర‌స్తుతం ఇద్ద‌రు భామ‌లు కొన్ని క్రేజీ ప్రాజెక్ట్ ల్లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. శ్రుతిహాస‌న్ త‌మిళ్ తో పాటు తెలుగు సినిమాలు చేస్తోంది. లేడీ సూప‌ర్ మాత్రం కోలీవుడ్ హీరోల‌తోనే చేస్తుంది. అలాగే తాను సోలోగా మ‌రికొన్ని చిత్రాలు చేస్తోంది.