Begin typing your search above and press return to search.

కాబోయే స‌ఖి పేరును ఫోన్‌లో అలా సేవ్ చేసాడు!

అంతేకాదు త‌న ఫోన్ లో కాబోయే భార్య లావ‌ణ్య పేరును LAVN అని సేవ్ చేసాన‌ని తెలిపాడు.

By:  Tupaki Desk   |   23 Aug 2023 4:39 AM GMT
కాబోయే స‌ఖి పేరును ఫోన్‌లో అలా సేవ్ చేసాడు!
X

జూన్‌లో నిశ్చితార్థం జరిగిన తర్వాత వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి జంట నిరంత‌రం వార్త‌ల్లో నిలుస్తోంది. ఈ జంట పబ్లిక్‌గా ప్రతిదీ ఓపెన‌వుతోంది. త‌మ మ‌ధ్య స్నేహం ప్రేమానుబంధానికి సంబంధించిన చాలా సంగ‌తుల్ని ఓపెన్ గా షేర్ చేసారు. అంతేకాదు.. జంట గోల్స్ కి సంబంధించిన‌ ఫోటోలు వీడియోల‌ను షేర్ చేస్తున్నారు. అవి అభిమానులను సంభ్ర‌మాశ్చర్యాల‌కు గురిచేస్తున్నారు. ఈ జంట మునుపటి ఆదివారం బోటింగ్ అడ్వెంచర్‌ని ఆస్వాధిస్తూ క‌నిపించారు. వరుణ్ తేజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో బోట్ రైడ్ కి సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేసాడు. జలపాతం నేపథ్యంలో ఉన్న వీడియోలో లావణ్య పడవలో వరుణ్ సరసన కూర్చుని రోయింగ్ చేస్తోంది.

"పార్కులోని ప్రమాదకరమైన జలపాతం నుండి నేను మా ఇద్దరినీ రక్షించినప్పుడు" అని వ‌రుణ్‌ క్యాప్షన్‌లో రాశాడు. బోటింగ్ డేట్ సమయంలో లావణ్య త్రిపాఠి రోయింగ్ నైపుణ్యాలను ఎగ‌తాళి చేస్తూ వరుణ్ తేజ్ ఆట‌ప‌ట్టించాడు. అంతేకాదు.. లావణ్య త్రిపాఠితో తనకున్న అనుబంధాన్ని వరుణ్ తేజ్ వెల్లడించాడు. దీనికి ముందు శుక్రవారం వరుణ్, లావణ్య బ్రేక్ ఫాస్ట్ డేట్ ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. ఇంత‌లోనే తన చిత్రం 'గాండీవ‌దారి అర్జున'ను ప్రమోట్ చేస్తూ వరుణ్ మొదటిసారి లావణ్య త్రిపాఠి గురించి మాట్లాడాడు.

మేమిద్దరం ఐదారేళ్లుగా మంచి స్నేహితులం. నేను ఇష్టపడేది ఏమిటో.. నాకు ఏది అవసరమో ఆమెకు తెలుసు. ముందుగా నేనే ల‌వ్ ప్రపోజ్ చేశాను. మా నిర్ణయాన్ని మా ఇద్దరి కుటుంబాలు ఆమోదించాయి. మా నిశ్చితార్థం మాదిరిగానే పెళ్లి కూడా చాలా సింపుల్‌గా జరగనుంది.. అని వ‌రుణ్ తెలిపారు. అంతేకాదు త‌న ఫోన్ లో కాబోయే భార్య లావ‌ణ్య పేరును LAVN అని సేవ్ చేసాన‌ని తెలిపాడు. త‌న ఫోన్ తీసుకుని త‌నే స్వ‌యంగా అలా సేవ్ చేసింద‌ని కూడా సీక్రెట్ ని బ‌హిర్గ‌తం చేసాడు. లావ‌ణ్యకు మొద‌టి కానుక ఏమి ఇచ్చారు? అని ప్ర‌శ్నించ‌గా.. త‌న‌కు గుర్తు లేద‌ని కూడా వ‌రుణ్ తేజ్ వెల్ల‌డించాడు.

జూన్ 9న హైదరాబాద్‌లో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి జంట‌ నిశ్చితార్థం జ‌రిగింది. ఈ జంట పెళ్లి వివరాలను అధికారికంగా ప్రకటించనప్పటికీ ఇటలీలో కొద్దిమంది బంధుమిత్రుల స‌మ‌క్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ప్లాన్ చేస్తున్నారని క‌థ‌నాలొస్తున్నాయి. పెళ్లి తేదీ, వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పెళ్లి తర్వాత ఈ జంట పరిశ్రమ స్నేహితులు, రాజకీయ నాయకుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్‌ను నిర్వహిస్తార‌ని తెలిసింది. అంతరిక్షం 9000 KMPH, మిస్టర్ వంటి చిత్రాలలో కలిసి పనిచేస్తున్నప్పుడు ఈ ఇద్ద‌రూ ప్రేమలో పడ్డారు. వారు చాలా సంవత్సరాలుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. కానీ మీడియా మెరుపులకు దూరంగా రహస్యంగా ఉంచారు. వ‌రుణ్ తేజ్ న‌టించిన గాండీవ‌ధార అర్జున విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.