Begin typing your search above and press return to search.

వరుణ్-లవ్ సెలబ్రేషన్స్.. రెడ్ డ్రెస్ స్టన్నింగ్ లుక్స్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   26 Dec 2023 9:56 AM GMT
వరుణ్-లవ్ సెలబ్రేషన్స్.. రెడ్ డ్రెస్ స్టన్నింగ్ లుక్స్
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ ఇద్దరూ రెండు కుటుంబాలను ఒప్పించి నవంబర్ 1వ తేదీన ఇటలీలో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. రెండు కుటుంబాలు, సన్నిహితుల మధ్యే వరుణ్ లావణ్యల వివాహం జరిగింది. అనంతరం హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. పెళ్లి తర్వాత వరుణ్, లావణ్య ఎక్కడికి వెళ్లినా వారి ఫొటోలు ఫుల్ వైరల్ గా మారుతున్నాయి. మెగా వారి కొత్త కోడలు అంటూ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు.


తాాజాగా మెగా, అల్లు కుటుంబాలు కలిసి క్రిస్మస్ సెలబ్రేషన్లను గ్రాండ్‍గా జరుపుకున్నాయి. హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకలో మెగా హీరోలతో పాటు కుటుంబసభ్యులు ఈ పార్టీలో సందడి చేశారు. రామ్‍చరణ్, అల్లు అర్జున్‍ సహా మరికొందరు కుటుంబ సభ్యులు ఈ సెలబ్రేషన్లలో పాల్గొన్నారు. రామ్‍చరణ్, అల్లు అర్జున్‍ను ఒకే ఫ్రేమ్‍లో చూసిన అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.


కాగా, ఇటీవలే పెళ్లి చేసుకున్న కొత్త జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కూడా ఈ సెలబ్రేషన్స్ లో సందడి చేశారు. వారికి కొణిదెల నిహారిక కూడా తోడవడంతో సంబరాలు మిన్నంటాయి. ఈ ఫొటోలను వరుణ్ తేజ్, నిహారిక ఇన్‍ స్టాగ్రామ్‍ లో పోస్ట్ చేశారు. మెగా క్రిస్మస్ హంగామాకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

మెగా కోడలు లావణ్య త్రిపాఠికి ఇదే మొదటి క్రిస్మస్ కావడం విశేషం. ఈ పార్టీలో లావణ్య రెడ్ కలర్ షైనింగ్ డైస్ లో మెరిసిపోయింది. వరుణ్ కూడా బ్లాక్ అండ్ రెడ్ టీషర్ట్ తో ఎటెండ్ అయ్యారు. న్యూ కపుల్ మ్యాచింగ్ డ్రెస్లు వేసుకుని సందడి చేశారు. పార్టీలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

ఇటీవలే ఈ జంట హనీమూన్ కు వెళ్లింది. అత్యంత చల్లని ప్రదేశం అయిన ఆర్కిటిక్ దగ్గరగా ఉండే ఫిన్లాండ్ దేశంలోని ల్యాప్ లాండ్ అనే ఏరియాకు వరుణ్, లావణ్య్ వెళ్లారు. అక్కడ -10 డిగ్రీల చలిలో, మంచు కురుస్తుంటే హనీమూన్ ఎంజాయ్ చేశారు. ఫిన్లాండ్ నుంచి పలు ఫొటోలు కూడా తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరోవైపు, వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం 2024 ఫిబ్రవరి 16న విడుదల కానుంది.