Begin typing your search above and press return to search.

లావ‌ణ్య త్రిపాఠి మెట్టినింటినీ ఒప్పిస్తుందా!

మెగా వార‌సుడు వ‌రుణ్ తేజ్ ని వివాహ చేసుకుని లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల ఇంట కోడ‌లిగా అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 Nov 2023 8:17 AM GMT
లావ‌ణ్య త్రిపాఠి మెట్టినింటినీ  ఒప్పిస్తుందా!
X

మెగా వార‌సుడు వ‌రుణ్ తేజ్ ని వివాహ చేసుకుని లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల ఇంట కోడ‌లిగా అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. అయోధ్య‌కి చెందిన లావ‌ణ్య హైద‌రాబాద్ తెలుగింట కోడ‌లయ్యారు. మ‌రి ఇప్పుడామె సినిమాలు కొన‌సాగిస్తారా? లేక కొణిదెల ఇంట కోడ‌లిగానే ఇంటి బాధ్య‌త‌ల‌కే ప‌రిమితం అవుతారా? అన్న‌ది ప్రేక్ష‌కాభిమానుల్లో ఉన్న సందేహం. లావ‌ణ్య‌కి సినిమాలంటే ఎంతో ఆస‌క్తి.

ఆ ఇష్టంతోనే ఇంట్లో త‌ల్లిదం డ్రుల్ని ఒప్పించి మోడ‌లింగ్ రంగంలోకి వ‌చ్చారు. అటుపై సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలుత సినిమాలంటే ఇంట్లో పేరెంట్స్ అంగీక‌రించ‌లేదు. ఆ కుటుంబం కోర్టుల్లో ఉన్న‌త ఉద్యోగాల్లో కొన‌సాగుతున్నారు. తండ్రి..సోద‌రుడు జ‌డ్జీలుగా బాధ్య‌త‌లు నెర‌వేరుస్తున్నారు. లావ‌ణ్య ని కూడా ఉన్న‌త ఉద్యోగంలో చూడాల‌ని ఆ కుటుంబం ఆశ‌పడ్డారు. కానీ ఆమె ఆస‌క్తి రంగుల ప్ర‌పంచం. జీవితాన్ని కొత్త‌గా చూడాలి అన్న‌ది ఆమె ఆశ‌. రెగ్యుల‌ర్ లైఫ్ కి భిన్నంగా ఉండ‌టం అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే లావ‌ణ్య మ‌న‌సు సినిమాలు కోరుకుంది.

దీంతో చ‌దువు పూర్త‌యిన త‌ర్వాత స్నేహితుల స‌హకారం కూడా తోడ‌వ్వ‌డంతో సినిమాల్లోకి వ‌చ్చారు. ఆ త‌ర్వాత త‌న‌కు తానుగానే తెలుగు ప‌రిశ్ర‌మ‌లో న‌టిగా నిల‌దొక్కుకున్నారు. అయితే వివాహం త‌ర్వాత సెకెండ్ ఇన్నింగ్స్ ఎలా ప్రారంభిస్తారు ? అన్న‌ది ఆస‌క్తిక‌రం. పుట్టినిల్లు త‌ర‌హాలోనే మెట్టినింటిని ఒప్పించి కంబ్యాక్ అవుతారా? కోడ‌లిగా కుటుంబ బాధ్య‌త‌ల‌కే ప‌రిమితం అవుతారా? అన్న‌ది వేచి చూడాలి.

ఇక మెగా ఫ్యామిలీలో చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత నిర్మాణ రంగంలోకి తాజాగా ఎంట‌ర్ అయ్యారు. అంత‌కు ముందు కాస్ట్యూమ్ డిజైన‌ర్ గా కెమెరా వెనుకున్నారు. ఇప్పుడు నిర్మాణంలోకి దిగ‌డంతో ఇక‌పై కెమెరా ముందుకు రావాల్సి ఉంటుంది. అలాగే నాగ‌బాబు కుమార్తె నిహారిక పెళ్లికి ముందే సినిమాలు చేసారు. వివాహం తర్వాత కొంత కాలం కెమెరాకి దూరంగా ఉన్నారు. ఇటీవ‌లే విడాకుల తో వేరైన త‌ర్వాత మ‌ళ్లీ నిహారిక కంబ్యాక్ అయ్యారు. ఈ నేప‌థ్యంలో లావ‌ణ్య త్రిపాఠీ న‌టిగా ఆ ఛాన్స్ తీసుకుంటారా? అన్న‌ది చూడాలి.