Begin typing your search above and press return to search.

వరుణ్ మిసెస్‌.. ప్రభాస్ టైటిల్‌!

మెగా హీరో వరుణ్ తేజ్ తో పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి కొత్తగా ఇంకా ఏ సినిమాలకు కమిట్ అవ్వలేదు. త్వరలోనే సెకండ్ ఇన్నింగ్స్ ను షురూ చేసే ఆలోచనలో లావణ్య త్రిపాఠి ఉన్నట్లుగా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   3 Jan 2024 9:42 AM GMT
వరుణ్ మిసెస్‌.. ప్రభాస్ టైటిల్‌!
X

మెగా హీరో వరుణ్ తేజ్ తో పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి కొత్తగా ఇంకా ఏ సినిమాలకు కమిట్ అవ్వలేదు. త్వరలోనే సెకండ్ ఇన్నింగ్స్ ను షురూ చేసే ఆలోచనలో లావణ్య త్రిపాఠి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ అందాల రాక్షసి అంతకు ముందు ఓ వెబ్‌ సిరీస్ తో రాబోతుంది.


లావణ్య త్రిపాఠి సినిమాలతోనే కాకుండా వెబ్‌ సిరీస్ తో కూడా మెప్పించేందుకు సిద్ధం అన్నట్లుగా త్వరలో డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్ ద్వారా ఓ వెబ్‌ సిరీస్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ వెబ్‌ సిరీస్‌ కి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు.

మిస్‌ పర్ఫెక్ట్‌ అంటూ లావణ్య త్రిపాఠి రాబోతుంది. ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్‌ ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అదే తరహా టైటిల్ తో అందాల రాక్షసి వెబ్‌ సిరీస్ తో రాబోతున్న నేపథ్యంలో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

లావణ్య త్రిపాఠితో పాటు అభిజిత్‌, అభిజ్ఞ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌ లో రూపొందిన ఈ కామెడీ వెబ్‌ సిరీస్‌ ని అతి త్వరలో హాట్ స్టార్ స్ట్రీమింగ్‌ చేయబోతుంది. మరో వైపు తమిళ్ లో కూడా లావణ్య ఒక సినిమాను చేసింది. ఆ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది.