Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ అంటే ప‌డి చ‌స్తోంది

భార‌తీయ డ్యాన్సింగ్ ప్ర‌తిభ స‌రిహ‌ద్దులు దాటి ఆక‌ర్షిస్తోంది. హృతిక్ రోష‌న్, ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ వంటి స్టార్ల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫాలోవ‌ర్స్ ఉన్నారు.

By:  Tupaki Desk   |   1 July 2025 6:48 PM IST
అల్లు అర్జున్ అంటే ప‌డి చ‌స్తోంది
X

భార‌తీయ డ్యాన్సింగ్ ప్ర‌తిభ స‌రిహ‌ద్దులు దాటి ఆక‌ర్షిస్తోంది. హృతిక్ రోష‌న్, ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ వంటి స్టార్ల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ అంటే ప‌డి చ‌చ్చే ఒక అమెరిక‌న్ డ్యాన్సింగ్ క్వీన్ గురించి ప‌రిచ‌యం చేయాలి.

ఆమె పేరు లారెన్ గాట్లీబ్. అమెరికన్ నృత్యకారిణి.. 2006లో `సో యు థింక్ యు కెన్ డ్యాన్స్` 2వ‌ సీజన్‌లో కొరియోగ్రాఫర్ టైస్ డియోరియోకు సహాయం చేసింది. మరుసటి సంవత్సరం లారెన్ ఇదే షోలో పాల్గొని టాప్ 6 ప్రదర్శనకారులలో ఒకరిగా నిలిచింది. అంత‌ర్జాతీయ పాప్ స్టార్స్ రిహన్న, మరియా కారీ, బ్రిట్నీ స్పియర్స్, షకీరా, సీన్ కింగ్‌స్టన్, క్యారీ అండర్‌వుడ్, విల్లో స్మిత్, ఎన్రిక్ ఇగ్లేసియాస్ వంటి కళాకారులతో కలిసి ప్రదర్శన ఇచ్చింది. ఆమె గ్లీ, హన్నా మోంటానా: ది మూవీ, బ్రింగ్ ఇట్ ఆన్: ఫైట్ టు ది ఫినిష్‌లలో కూడా నృత్యం చేసింది.

12ఏళ్ల క్రితం రెమో డిసౌజా `ABCD: ఎనీ బాడీ కెన్ డ్యాన్స్‌`తో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. 2013లో ఝలక్ దిఖ‌లాజా ఫైనల్‌కు కూడా చేరుకుంది. తరువాత న్యాయమూర్తిగా తిరిగి వచ్చింది. ఇటీవల ఓ సంభాష‌ణ‌లో త‌న‌కు అల్లు అర్జున్ అంటే ఎంత ఇష్ట‌మో ఓపెనైంది. అత‌డితో క‌లిసి డ్యాన్సులు చేయాల‌ని, న‌టించాల‌నుంద‌ని లారెన్ వ్యాఖ్యానించింది.

``అల్లు అర్జున్ యాక్షన్ అంటే చాలా ఇష్టం. అత‌డి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అతడు చాలా కూల్.. క‌లిసి ప‌ని చేయాల‌ని ఉంది`` అని తెలిపింది. అలాగే హ‌నీసింగ్ తో ఒక పాట‌లో న‌ర్తించాల‌ని, హృతిక్ తో ఏదో ఒక రోజు వేదిక‌ను పంచుకునే సంద‌ర్భం వ‌స్తుంద‌ని కూడా ఆశాభావం వ్య‌క్తం చేసింది. హృతిక్ తో క‌లిసి డ్యాన్స్ చేయ‌డం మ్యాజిక్ అవుతుంది. ఐఫా అవార్డుల‌ ఆఫ్ట‌ర్ పార్టీలో త‌న బ‌ర్త్ డే గురించి తెలుసుకుని త‌న‌కోసం కేక్ తెచ్చి సెల‌బ్రేట్ చేసాడ‌ని, హృతిక్ నా కోసం పాడాడ‌ని కూడా వెల్ల‌డించింది. లారెన్ ఇటీవల జూన్ 11న టస్కానీలో తన దీర్ఘకాల భాగస్వామి టోబియాస్ జోన్స్‌ను వివాహం చేసుకుంది.