లతా రజనీకాంత్‌కు కోర్టులో ఎదురు దెబ్బ
సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్' పాన్ ఇండియా విజయాన్ని ఆస్వాధిస్తున్నారు. తదుపరి సినిమాల ప్రణాళికలతో బిజీగా ఉన్నారు
By: Tupaki Desk | 11 Oct 2023 10:52 AM ISTసూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్' పాన్ ఇండియా విజయాన్ని ఆస్వాధిస్తున్నారు. తదుపరి సినిమాల ప్రణాళికలతో బిజీగా ఉన్నారు. మరోవైపు రజనీకాంత్ భార్య లతకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మోసం చేశారనే ఆరోపణలతో ఆమెపై కేసును సుప్రీంకోర్టు పునరుద్ధరించింది. గతంలో కర్ణాటక హైకోర్టు లతాజీపై ఉన్న నేరారోపణలను కొట్టివేసింది. తమిళ చిత్రం 'కొచ్చాడైయాన్'కు సంబంధించి లతా రజనీకాంత్‌పై ఆరోపించిన నేరారోపణలను సుప్రీంకోర్టు పునరుద్ధరించింది.
చెన్నైకి చెందిన వాణిజ్య ప్రకటనల కంపెనీ 'యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్' 2015లో దాఖలు చేసిన కేసు నుండి మోసం ఫోర్జరీ ఆరోపణలను లతా రజనీకాంత్ ఎదుర్కొంటున్నారు. మీడియావన్ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ నిర్మించిన 'కొచ్చాడైయాన్' చిత్రానికి సంబంధించిన ఆర్థికపరమైన అంశంపై వివాదం నడుస్తోంది. అప్పట్లో కర్ణాటక హైకోర్టు గతంలో లతపై చీటింగ్ ఆరోపణలను రద్దు చేసింది. అయితే ఫోర్జరీ కేసులను కొనసాగించడానికి అనుమతించింది.
సుప్రీం కోర్ట్ ఇటీవలి నిర్ణయం ప్రకారం.. లతా రజనీకాంత్ ట్రయల్ కోర్ట్ నుండి డిశ్చార్జ్ కోరవలసి ఉంటుంది లేదా క్రిమినల్ ప్రొసీడింగ్‌ల కొనసాగింపును సమర్థించిన 2018 సుప్రీం కోర్ట్ ఆర్డర్‌ను ఉటంకిస్తూ విచారణను ఎదుర్కోవలసి ఉంటుంది. లతా రజనీకాంత్ నిర్వహిస్తున్న స్కూల్ పైనా ఇంతకుముందు రకరకాల ఆరోపణలు ఎదురైన సంగతి తెలిసిందే.
