Begin typing your search above and press return to search.

RC 16: ఏం జరుగుతోందంటే..

ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ సినిమాలో క్యారెక్టర్ లుక్ కోసం రామ్ చరణ్ పై టెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   11 Sep 2023 3:41 AM GMT
RC 16: ఏం జరుగుతోందంటే..
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో RC 16 మూవీ తెరకెక్కనుంది. రీసెంట్ గా ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ తో చేస్తోన్న గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. దాని తర్వాత RC 16 సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ఏడాది ఆఖరులో సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.

ప్రీప్రొడక్షన్ వర్క్ తో పాటుగా క్యాస్టింగ్ ని ఫైనల్ చేసే పనిలో బుచ్చిబాబు ఉన్నాడంట. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లోనే ఈ చిత్రాన్ని నిర్మించనుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథతో పీరియాడికల్ జోనర్ లో ఈ మూవీ ఉండబోతోందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ సినిమాలో క్యారెక్టర్ లుక్ కోసం రామ్ చరణ్ పై టెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

డిఫరెంట్ లుక్స్ ని క్యారెక్టర్ కోసం ట్రై చేసారంట. మూవీలో రామ్ చరణ్ శారీరక వికలాంగుడి పాత్ర ఒకటి ఉంటుందంట. అలాగే డ్యూయల్ రోల్స్ ఈ చిత్రంలో కూడా రామ్ చరణ్ చేయనున్నాడంట. తండ్రికొడుకులుగా కనిపించనున్నాడంట. ఈ క్యారెక్టర్స్ కోసం లుక్ టెస్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలో ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఏమైనా సినిమాకి సంబందించిన అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందేమో అనేది చూడాలి.

రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ చెవిటివాడిగా నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. బుచ్చిబాబు సినిమా కోసం అలాగే ఏదైనా శారీరక వైకల్యం ఉన్న పాత్రలో కనిపిస్తే సెంటిమెంట్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. బుచ్చిబాబు కథ రాసుకున్న కచ్చితంగా సుకుమార్ ప్రమేయం కూడా ఉండొచ్చు. ఈ మధ్యకాలంలో అతను స్క్రీన్ ప్లే సహకారం అందించిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయి. RC 16 కూడా సుకుమార్ లక్కీ హ్యాండ్ కలిసొచ్చే ఛాన్స్ ఉంటుందని టాక్.

ఇక మూవీ లో జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం చాలా కాలం నుంచి జరుగుతోంది. ఒక వేళ చేస్తే మాత్రం కచ్చితంగా క్రేజీ కాంబినేషన్ అవుతుంది. బాలీవుడ్ హీరోయిన్ కోసమైతే బుచ్చిబాబు ట్రైచేస్తున్నారు. మరి ఫైనల్ గా ఎవరి వైపు మొగ్గుచూపిస్తాడనేది తెలియాల్సి ఉంది.