Begin typing your search above and press return to search.

ఆ ఫ్లాప్‌ మరవక ముందే.. ఈసారి ఏం చేస్తాడో?

చంద్రముఖి 2 ఫ్లాప్ తర్వాత లారెన్స్‌ సినిమాలంటే మరింతగా జనాల్లో ఆసక్తి తగ్గిందనే టాక్ ఉంది. కనుక జిగర్ తండ డబులెక్స్ సినిమా ఫరిస్థితి ఏంటి..

By:  Tupaki Desk   |   8 Nov 2023 4:27 AM GMT
ఆ ఫ్లాప్‌ మరవక ముందే.. ఈసారి ఏం చేస్తాడో?
X

కొరియోగ్రాఫర్ గా సినీ కెరీర్ ను ఆరంభించిన రాఘవ లారెన్స్‌ ఆ తర్వాత హీరోగా, దర్శకుడిగా కూడా మంచి పేరును సొంతం చేసుకున్నాడు. ఎవరికైనా కూడా హీరోగా చేయాలని, హీరోగా గుర్తింపు దక్కించుకోవాలని ఉంటుంది. లారెన్స్ కూడా కొరియోగ్రఫీ మరియు దర్శకత్వం పక్కన పెట్టి పూర్తిగా హీరోగా మారిపోయాడు. మొదట్లో హీరోగా హిట్స్ పడ్డా ఇప్పుడు డిజాస్టర్స్ తప్పడం లేదు.

లారెన్స్‌ నుంచి వచ్చిన ప్రతి సినిమా కూడా తమిళనాట అప్పుడు మినిమం వసూళ్లు సాధించిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో ఆయన సినిమాలు అంటేనే జనాలు లైట్‌ తీసుకుంటున్నారు. చాలా కష్టపడి, ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చంద్రముఖి 2 సినిమా ఫలితం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చంద్రముఖి 2 ఫ్లాప్ అంటూ లారెన్స్ కూడా ఒప్పుకున్నాడు.

చంద్రముఖి 2 సినిమా ఫ్లాప్‌ మరవక ముందే 'జిగర్‌ తండ డబులెక్స్‌' సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు గాను లారెన్స్ రెడీ అయ్యాడు. ఈ సినిమాలో లారెన్స్ తో పాటు ఎస్ జే సూర్య కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. లారెన్స్‌ హీరోగా ప్రచారం చేస్తే జనాలు ఎక్కువగా రావడం లేదు అంటూ మేకర్స్‌ ఈ సినిమాలో ఇద్దరు హీరోలు అన్నట్లుగా పబ్లిసిటీ చేస్తున్నారు.

సినిమా ప్రచారం లో ఎస్ జే సూర్య ను కూడా లారెన్స్ తో సమానంగా చూపిస్తున్నారు. సినిమా లో కచ్చితంగా లారెన్స్ పాత్ర ఎక్కువ ఉంటుందట. అయినా కూడా చంద్రముఖి 2 మరియు అంతకు ముందు సినిమాల ఫలితాల కారణంగా జిగర్ తండ డబులెక్స్ సినిమా ను విభిన్నంగా ప్రమోట్‌ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా ఫలితం పై లారెన్స్‌ కెరీర్ ప్లాన్ ఆధారపడి ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రాఘవ లారెన్స్ ను హీరోగా చూసినంత వరకు చాలు.. ఇక పై దర్శకుడిగా ఆయన సినిమాలు చేస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రముఖి 2 ఫ్లాప్ తర్వాత లారెన్స్‌ సినిమాలంటే మరింతగా జనాల్లో ఆసక్తి తగ్గిందనే టాక్ ఉంది. కనుక జిగర్ తండ డబులెక్స్ సినిమా ఫరిస్థితి ఏంటి... ఈసారి అయినా లారెన్స్ ఆకట్టుకుంటాడా అనేది చూడాలి.