Begin typing your search above and press return to search.

గుంపులో ఒక‌డు అస‌భ్యంగా తాకాడు: లారా ద‌త్తా

తాజాగా పాపుల‌ర్ హాట‌ర్ ఫ్లైకి ఇచ్చిన ఇంటర్వ్యూలో త‌న‌కు ఎదురైన వేధింపుల గురించి లారా దత్తా ఓపెనైంది.

By:  Tupaki Desk   |   30 April 2024 4:41 PM GMT
గుంపులో ఒక‌డు అస‌భ్యంగా తాకాడు:  లారా ద‌త్తా
X

మాజీ మిస్ లారా ద‌త్తా ఎఫైర్లు, బోల్డ్ ఫోటోషూట్లు నిరంత‌రం హాట్ టాపిక్. కానీ ఇటీవ‌ల లారా లైమ్ లైట్ కి దూరంగా ఉంది. లారా దత్తా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన తొలి చిత్రం అందాజ్ మ్యూజిక్ లాంచ్ ఈవెంట్‌లో ఒక అపరిచితుడు తనను ఎలా వేధించాడో గుర్తుచేసుకుంది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అక్షయ్ కుమార్, ప్రియాంక చోప్రాతో కలిసి లారా ఈవెంట్లో పాల్గొన్నారు.

తాజాగా పాపుల‌ర్ హాట‌ర్ ఫ్లైకి ఇచ్చిన ఇంటర్వ్యూలో త‌న‌కు ఎదురైన వేధింపుల గురించి లారా దత్తా ఓపెనైంది. నాటి ఆ సంఘటనను గుర్తుచేసుకుంటూ నేను చాలా ఈవ్-టీజింగ్ సంఘటనలను ఎదుర్కొన్నాను.. వాటి గురించి కూడా మాట్లాడాను అని అన్నారు. నా తొలి చిత్రం `అందాజ్` సంగీత విడుదల సందర్భంగా పీసీ-అక్ష‌య్ - నేను ఢిల్లీలోని చాందినీ చౌక్‌లోని రిథమ్ హౌస్‌కి వెళ్ళాము. మేము రిథమ్ హౌస్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ప్రపంచ సుందరి- మిస్ యూనివర్స్ అని నినాదాలు చేస్తూ పెద్ద సంఖ్యలో ప్రజలు మీది మీదికి విజృంభించారు.

ఆ గుంపులోంచి ఎవరో నన్ను గ‌ట్టిగా నొక్కారు. ఏదో తప్పు జరిగిందని నేను గ్రహించాను. బహుశా నా ఆర్మీ నేపథ్య శిక్షణ కారణంగా నేను అతడిని ప‌ట్టుకుని జ‌నంలోంచి బయటకు లాగాను.. అతడు రోడ్డుపై పడిపోయాడు. అయితే, నేను చీరలో ఉండ‌గానే ఆ కుర్రాడిని చాలా దారుణంగా కొట్టాను. అక్షయ్ చాలా కంగారుపడ్డాడు.. అతడు నన్ను ఆ కుర్రాడి నుండి దూరం చేసి ``నువ్వు ఇప్పుడు నటివి కావు`` అన్నాడు అని తెలిపారు.

లారా దత్తా ఇటీవల జియోసినిమాస్ లో `రాజ్‌నీతి`లో కనిపించింది. అలాగే నితేష్ తివారీ `రామాయణం`లో ఒక కీల‌క పాత్ర‌ను పోషిస్తుంది. `వెల్‌కమ్ టు ది జంగిల్`లోను న‌టిస్తోంది. అక్షయ్ కుమార్‌తో మ‌రోసారి లారా క‌లిసి ప‌ని చేయ‌నుంది.