Begin typing your search above and press return to search.

శూర్పణఖ, కైకేయి... ఏ పాత్ర ఇచ్చినా చేస్తా!

అందులో భాగంగానే కీలక పాత్ర కోసం బాలీవుడ్‌ స్టార్‌ నటి లారా దత్తా తో సంప్రదింపులు జరిపారు అంటూ వార్తలు వచ్చాయి.

By:  Tupaki Desk   |   1 May 2024 10:45 AM GMT
శూర్పణఖ, కైకేయి... ఏ పాత్ర ఇచ్చినా చేస్తా!
X

బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు మొత్తం భారతదేశ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం రణబీర్ కపూర్‌, సాయి పల్లవిల 'రామాయణం'. ఇటీవలే వీరిద్దరికి రాముడు, సీతగా లుక్ టెస్ట్‌ జరిగింది. అందుకు సంబంధించిన స్టిల్‌ ఒకటి లో క్వాలిటీతో బయటకు వచ్చింది. మేకర్స్ దాన్ని లీక్ చేసి ఉంటారు అనేది టాక్‌.

ఆ విషయం పక్కన పెడితే రామాయణం అనేది అతి పెద్ద ప్రాజెక్ట్‌. ఎన్నో ముఖ్యమైన పాత్రలు రామాయణంలో ఉంటాయి. వాటిల్లో ఏ ఒక్క పాత్రకు అల్లాటప్ప నటీ నటులను పెట్టినా కూడా మొత్తం సినిమా క్రేజ్ దెబ్బతినడంతో పాటు విమర్శలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే ప్రతి పాత్రకు స్టార్‌ ఇమేజ్ ఉన్న నటీనటులను తీసుకుంటున్నారు అనే వార్తలు వస్తున్నాయి.

అందులో భాగంగానే కీలక పాత్ర కోసం బాలీవుడ్‌ స్టార్‌ నటి లారా దత్తా తో సంప్రదింపులు జరిపారు అంటూ వార్తలు వచ్చాయి. లారా దత్తాను ఏ పాత్రలో చూస్తామా అంటూ ఆమె అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో స్వయంగా ఆమె నుంచి స్పందన వచ్చింది.

నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణం సినిమా ఒక గొప్ప ప్రాజెక్ట్‌. అలాంటి భారీ సినిమాల్లో నటించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఖచ్చితంగా నాకు కూడా నితేష్ తివారీ రామాయణంలో నటించాలని ఉంది. అయితే ఇప్పటి వరకు ఎవరు కూడా నన్ను ఆ సినిమా కోసం సంప్రదించలేదు అంటూ క్లారిటీ ఇచ్చింది.

ఒక వేళ తనకు ఛాన్స్ వస్తే శూర్పణఖ, కైకేయి, మండోదరి ఇలా ఏ పాత్రకు అయినా ఓకే చెప్తాను అంటూ లారా దత్తా చెప్పుకొచ్చింది. రామాయణం సినిమాలో చిన్న పాత్ర పోషించే అవకాశం వచ్చినా కూడా అది చాలా పెద్ద అవకాశం. కనుక లారా దత్తా మాత్రమే కాకుండా ఏ ఒక్కరు కూడా రామాయణం ఆఫర్‌ ను వదులుకోరు.

రణబీర్‌ కపూర్‌, సాయి పల్లవి లు దాదాపుగా రాముడు, సీత పాత్రలకు కన్ఫర్మ్‌ అవ్వడంతో ఇప్పుడు రావణుడిగా ఎవరు కనిపించబోతున్నారు అనే విషయమై చర్చ జరుగుతోంది. మొన్నటి వరకు కన్నడ స్టార్‌ హీరో యశ్‌ ను రావణుడిగా పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ విషయంలో క్లారిటీ రాలేదు.