Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి దీపావళి గిఫ్ట్‌ ఇచ్చిన కూతురు

ఈ సినిమాలో రజినీకాంత్‌ హీరోగా కాకుండా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. తాజాగా దీపావళి సందర్భంగా టీజర్ ను విడుదల చేయడం జరిగింది.

By:  Tupaki Desk   |   12 Nov 2023 11:14 AM GMT
సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి దీపావళి గిఫ్ట్‌ ఇచ్చిన కూతురు
X

సూపర్ స్టార్‌ రజినీకాంత్‌ చాలా సంవత్సరాల ఫ్లాప్స్ తర్వాత జైలర్ సినిమా తో కమర్షియల్‌ సక్సెస్ ని దక్కించుకున్నాడు. ఆ సినిమా ఇచ్చిన జోష్ తో ప్రస్తుతం రెండు మూడు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి లాల్ సలామ్‌. ఐశ్వర్య రజినీకాంత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న లాల్ సలామ్‌ సినిమా విడుదలకు సిద్ధం అయింది.

ఈ సినిమాలో రజినీకాంత్‌ హీరోగా కాకుండా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. తాజాగా దీపావళి సందర్భంగా టీజర్ ను విడుదల చేయడం జరిగింది. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా లో రజినీకాంత్ ను ఒక ముస్లిం పెద్ద వ్యక్తిగా అలాగే ఒక ముఠాకి నాయకుడిగా చూడబోతున్నాం అని టీజర్ చూస్తే ఉంటే అర్థం అవుతుంది.

ఒక వైపు క్రికెట్‌ ను చూపిస్తూ మరో వైపు గొడవలు చూపించడం ద్వారా ఈ సినిమా రెండు గ్రూప్‌ ల మధ్య జరిగే సంఘర్షణల ఆధారంగా రూపొందించిన కథ తో రూపొందినట్లుగా అనిపిస్తోంది. తప్పకుండా ఈ సినిమాలోని రజినీకాంత్‌ పాత్రను ఆయన అభిమానులు ఆధరిస్తారని, అంతే కాకుండా ఒక మంచి సినిమాగా ఇది నిలుస్తుందనే నమ్మకంను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.

రజినీకాంత్‌ ను మోయినుద్దీన్‌ భాయ్‌ గా చూపించారు. హిందు మరియు ముస్లిం ల మధ్య జరిగే గొడవలను కూడా ఈ సినిమాలో చూపిస్తారా అనే చర్చ జరుగుతోంది. విష్ణు విశాల్ మరియు విక్రాంత్‌ లు హీరోలుగా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. రెగ్యులర్‌ సినిమాలకు విభిన్నంగా ఈ సినిమా ఉండబోతుందట.

దీపావళి సందర్భంగా లాల్ సలామ్‌ సినిమా టీజర్ విడుదల చేయడం ద్వారా సినిమా ను సంక్రాంతి రేస్ లోకి ఈ చిత్ర యూనిట్‌ సభ్యులు తీసుకు రావడం జరిగింది. టీజర్ లో సినిమాను తమిళంలో మాత్రమే కాకుండా అన్ని భాష ల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నట్లుగా పేర్కొన్నారు. అయితే సినిమాలో తమిళ ఫ్లేవర్‌ ఎక్కువగా ఉండటంతో ఎంత వరకు ఈ సినిమా తమిళేతర భాషల్లో ఆడుతుందో చూడాలి.