Begin typing your search above and press return to search.

తలైవా క్రేజ్.. స్ట్రాంగ్ ఓపెనింగ్స్ డౌటే?

ఒక స్టార్ హీరో సినిమా థియేటర్స్ లోకి వస్తోంది అంటే సందడి ఏ స్థాయిలో ఉండాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు

By:  Tupaki Desk   |   8 Feb 2024 2:13 PM GMT
తలైవా క్రేజ్.. స్ట్రాంగ్ ఓపెనింగ్స్ డౌటే?
X

ఒక స్టార్ హీరో సినిమా థియేటర్స్ లోకి వస్తోంది అంటే సందడి ఏ స్థాయిలో ఉండాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫ్యాన్స్ హడావిడి ఒక రేంజ్ లో ఉంటుంది. అలాగే ప్రమోషన్స్ కూడా గట్టిగా చేస్తారు. అయితే ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతోన్న స్టార్ హీరోల సినిమాలకి పెద్దగా ప్రమోషన్స్ చేయడం లేదు. హీరో కటౌట్ కనిపిస్తే థియేటర్స్ కి ఫ్యాన్స్ వచ్చేస్తారని భావిస్తున్నారు.

సలార్ విషయంలో ప్రశాంత్ నీల్ ఇలాంటి ప్రయోగమే చేశారు. అందుకే వెయ్యి కోట్లు కలెక్ట్ చేయాల్సిన మూవీ కాస్తా 730 కోట్ల వరకే కలెక్ట్ చేసింది. ప్రభాస్ ఇమేజ్ తో ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చిన ఎక్స్ పెక్ట్ చేసే స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టలేదు. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాకి కూడా ఐశ్వర్య రజినీకాంత్ అదే ఫార్ములాని ఫాలో అవుతోంది. గత ఏడాది రజినీకాంత్ జైలర్ మూవీ 600 కోట్లకి పైగా కలెక్ట్ చేసి రికార్డులు సృష్టించింది.

దీని తర్వాత సూపర్ స్టార్ ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో లాల్ సలామ్ మూవీలో చేశారు. నిజానికి ఈ సినిమాలో రజినీకాంత్ చేస్తున్నది మెయిన్ లీడ్ కాదు. కానీ స్టోరీలో అతని పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. దీంతో లాల్ సలామ్ సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రంగానే ప్రమోట్ చేశారు. ఆయన అయితే మీడియా ముందుకొచ్చి సినిమా గురించి పెద్దగా చెప్పిందేమీ లేదు.

విష్ణు విశాల్, విక్రాంత్ మూవీలో మెయిన్ హీరోలుగా ఉన్నారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో చిత్రాన్ని నిర్మించింది. ట్రైలర్ బాగానే ఉన్న పెద్దగా బజ్ అయితే క్రియేట్ చేయలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీ స్థాయిలో జరిగినట్లు కనిపించడం లేదు. ఇక తెలుగులో అయితే లాల్ సలామ్ మీద జీరో బజ్ ఉంది. సూపర్ స్టార్ రజినీకాంత్ ఉన్నాడు కాబట్టి సినిమాకి వెళ్ళిపోతారు అనే ఫీలింగ్ తో ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ చేస్తున్నారు.

ప్రస్తుతం సినిమా మీద ఉన్న బజ్ బట్టి చూస్తుంటే డీసెంట్ ఓపెనింగ్స్ కూడా లాల్ సలామ్ మూవీకి వచ్చేలా లేవనే మాట ట్రేడ్ పండితుల నుంచి వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి9న ఈ మూవీ థియేటర్స్ లోకి రానున్న నేపథ్యంలో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది వేచి చూడాలి.