Begin typing your search above and press return to search.

600 కోట్ల కలెక్షన్స్ వస్తే.. నెక్స్ట్ సినిమాకు సౌండ్ లేదు

వచ్చే ఏడాదికి అంటే 2025లో తలైవా.. తన 50 సంవత్సరాల సినీ జీవితాన్ని పూర్తి చేసుకోబోతున్నారు

By:  Tupaki Desk   |   3 Feb 2024 6:15 AM GMT
600 కోట్ల కలెక్షన్స్ వస్తే.. నెక్స్ట్ సినిమాకు సౌండ్ లేదు
X

తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్.. 73 ఏళ్ల వయసులో దూసుకుపోతున్నారు. ఇక రజనీ కాంత్ పని అయిపోయింది అన్న వారి నోర్లు మూతపడేలా.. బాక్సాఫీస్ బ్లాస్ట్ అయ్యేలా జైలర్ తో సమాధానం చెప్పారు. నెక్ట్స్ మూవీస్ కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే నాలుగు సినిమాలను లైన్ లో పెట్టిన స్టార్ సీనియర్ హీరో.. కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు.


వచ్చే ఏడాదికి అంటే 2025లో తలైవా.. తన 50 సంవత్సరాల సినీ జీవితాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. ఏడు పదుల వయసులో కూడా అభిమానులను ఇలా ఎంటర్టైన్ చేయడం ఒక్క రజనీకే చెల్లింది. అంతే కాదు ఈ ఏజ్ లో తలైవా.. యంగ్ డైరెక్టర్లకు ఎక్కువగా అవకాశం ఇస్తూ వాళ్లకు లైఫ్ ఇస్తున్నారు. వాళ్లలో టాలెంట్ ను బయటకు తీసి.. వారి చేత ప్రయోగాలు చేస్తూ తాను కూడా ప్రయోగాలు చేస్తున్నారు.

గతేడాది రజనీ నటించిన జైలర్ మూవీ రూ.600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన రజనీ.. తాజాగా తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కిన లాల్ సలామ్ మూవీలో నటించారు. మొయిద్దీన్ భాయ్‌ అనే అతిథి పాత్రలో యాక్ట్ చేశారు. ఆయన రోల్ ఈ సినిమాలో కీలకమే అన్నట్లు తెలుస్తోంది. కానీ ఈ మూవీ తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా పెద్దగా బజ్ క్రియేట్ చేసుకోలేదు. చాలా మందికి అసలు ఈ సినిమా ఉందని కూడా తెలియదట.

రజనీ నటించిన సినిమా అంటే ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అవుతుంది. అలాంటిది ఈ చిత్రానికి ఎక్కడా ఎలాంటి సందడి లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ మూవీలో కేవలం అరగంట మాత్రమే రజనీకాంత్ కనిపిస్తారని సమాచారం. ఈ రోల్ కోసం రూ.40 కోట్ల రెమ్యునరేషన్ ను రజనీ తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటించారు. నిరోషా, తంగదొరై, ధన్య బాలకృష్ణన్ ప్రధాన పాత్రలు పోషించారు. జీవిత రాజశేఖర్ ఈ సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఏ ఆర్ రెహమాన్ సంగీతమందించారు. మరి ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.