Begin typing your search above and press return to search.

21రోజుల షూటింగ్ ఫుటేజ్ మిస్సింగ్

10 కెమెరాల సెట‌ప్ తో 21 రోజుల పాటు ఒక క్రికెట్ మ్యాచ్ ని చిత్రీక‌రించామ‌ని కూడా వెల్ల‌డించారు.

By:  Tupaki Desk   |   12 March 2024 6:22 AM GMT
21రోజుల షూటింగ్ ఫుటేజ్ మిస్సింగ్
X

ఏదైనా ఒక సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో అనూహ్యంగా ఫుటేజ్ మిస్స‌యితే ఏం చేయాలి? అది కూడా ఒక‌రోజు రెండు రోజులు కాదు.. ఏకంగా 21 రోజుల పాటు చిత్రీక‌ర‌ణ సాగాక‌, మొత్తం ఫుటేజ్ కి సంబంధించిన హార్డ్ డిస్కులు మిస్స‌యితే ఆ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు ఉండే కంగారు మాన‌సిక ఆందోళ‌న ఎలాంటిదో ఊహించ‌గ‌ల‌రా?

'లాల్ స‌లాం' షూటింగ్ స‌మ‌యంలో తాను ఎదుర్కొన్న అతి పెద్ద మాన‌సిక ఆందోళ‌న‌, క‌ష్టం గురించి ద‌ర్శ‌కురాలు ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ తాజా ఇంట‌ర్వ్యూలో ఓపెన‌య్యారు. త‌మ సినిమాని 21 రోజుల పాటు షూటింగ్ పూర్తి చేసామ‌ని, కానీ అనూహ్యంగా ఫుటేజ్ మిస్స‌యింద‌ని, హార్డ్ డిస్కులు క‌నిపించ‌కుండా పోయాయ‌ని ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ తెలిపారు. 10 కెమెరాల సెట‌ప్ తో 21 రోజుల పాటు ఒక క్రికెట్ మ్యాచ్ ని చిత్రీక‌రించామ‌ని కూడా వెల్ల‌డించారు.

రీషూట్లు చేయ‌డం, ఆర్టిస్టుల‌ను మునుప‌టి స్టేజ్ కి తీసుకురావ‌డం అన్న‌ది అలాంటి సంద‌ర్భాల్లో పెనుస‌వాల్ లాంటిది... కానీ అన్ని మ‌ర‌మ్మ‌త్తుల కోసం ప్ర‌య‌త్నించామ‌ని, రీఎడిట్ లు చేసామ‌ని కూడా ఐశ్వ‌ర్య వెల్ల‌డించారు. అయితే ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ ఎంత‌గా శ్ర‌మించినా కానీ తాను ఆశించిన ఫ‌లితాన్ని అందుకోలేక‌పోయ‌రు. లాల్ స‌లం బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ అయింది.

నిజానికి ఈ సినిమా ఆరంభంలో ఇలాంటి ఎదురు దెబ్బ తిన‌డంతో అది మాన‌సికంగా ద‌ర్శ‌కురాలిని కుంగ దీసింద‌ని కూడా ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌ర్చించుకుంటున్నారు. ఐశ్వ‌ర్య ధ‌నుష్ ద‌ర్శ‌కురాలిగా ఎదిగేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. కానీ వ‌రుస‌గా మూడు సినిమాల‌ను తెర‌కెక్కించ‌గా అవ‌న్నీ ఫ్లాపుల‌య్యాయి. లాల్ స‌లాం కోసం భారీ బ‌డ్జెట్ ని వెచ్చించినా డిజాస్ట‌ర్ ఫ‌లితం ఎదురైంది. ఇది ర‌జ‌నీకాంత్ లాంటి పెద్ద స్టార్ కి కూడా ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని తెచ్చి పెట్టింది.

ర‌జ‌నీ పాత్ర 10 నిమిషాలే అనుకుంటే..!

తాజా ఇంట‌ర్వ్యూలో ఐశ్వర్య రజనీకాంత్ లాల్ సలామ్ కోసం రజనీకాంత్‌ను ఎలా ఎంపిక చేశారనే దాని గురించి మాట్లాడింది. మొదట్లో ర‌జ‌నీ ఈ చిత్రంలో అతిధి పాత్రలో నటించాడని, అయితే అతడు సెట్స్ లో చేరాక స్థాయి ఉన్న నటుడికి కేవలం 10 నిమిషాల పాత్ర స‌రిపోద‌ని భావించిన‌ట్టు ఐశ్వ‌ర్య తెలిపారు. ఆమె మాట్లాడుతూ, ''మేము కథ రాసుకున్నప్పుడు, మొయిదీన్ భాయ్ పాత్ర (రజనీకాంత్ పోషించింది) చిత్రంలో కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉంది. అతడు సెంథిల్, జీవితమ్మ, లేదా కాళీ వంటి సినిమాలో మరొక పాత్రధారి మాత్రమే. కానీ సూపర్‌స్టార్ హోదాలో ఉన్న వ్యక్తిని ఆ పాత్రను పోషించడానికి తీసుకువచ్చినప్పుడు కేవలం 10 నిమిషాలు మాత్ర‌మే అంటే కుద‌ర‌ద‌ని భావించాం. చివరికి ఈ చిత్రం మొయిదీన్ భాయ్ చుట్టూ తిరిగేలా మార్చాం. కథ ముందుకు సాగడానికి అదే సరైన మార్గం. అంత స్థాయి ఉన్న నటుడు ప్రాజెక్ట్‌లోకి వచ్చినప్పుడు ఆ పాత్ర చుట్టూ సినిమా తిరగడం సరైనదని భావించిన‌ట్టు తెలిపారు.

సినిమా విడుదలకు రెండు నెలల ముందు మేము మొదటి సగంలో మొయిదీన్ భాయ్‌ని జోడించడానికి కొన్ని సన్నివేశాలను మార్చాము. క్లైమాక్స్‌కు 20 నిమిషాల ముందు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా మరింత ఆకర్షణీయమైన సన్నివేశాలను చిత్రీక‌రించాం అని కూడా తెలిపారు. లాల్ సలామ్ విభిన్న మత నేపథ్యాలకు చెందిన ఇద్దరు క్రికెటర్ల చుట్టూ తిరుగుతుంది. ఫిబ్రవరి 9న సినిమా విడుదలైంది.