బాబోయ్ సూపర్ స్టార్ సినిమా వస్తుందిరోయ్...!
సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్' సినిమాతో చాలా కాలం తర్వాత భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆయన ముఖ్య పాత్రలో నటించిన 'లాల్ సలామ్' సినిమాకు విపరీతమైన బజ్ క్రియేట్ అయింది.
By: Tupaki Desk | 31 May 2025 6:25 AMసూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్' సినిమాతో చాలా కాలం తర్వాత భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆయన ముఖ్య పాత్రలో నటించిన 'లాల్ సలామ్' సినిమాకు విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. ఆ సినిమాకు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించారు. వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందిన లాల్ సలామ్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. రజనీకాంత్ పాత్ర అవసరం లేకున్నా పెంచారు అంటూ చాలా మంది విమర్శలు చేశారు, అదే సమయంలో రజనీకాంత్ క్రేజ్‌తో సినిమాను అమ్ముకోవాలనే ఉద్దేశంతో ఆయన పాత్రను అనవసరంగా పెంచారు అనేది చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.
లాల్ సలామ్ సినిమా థియేట్రికల్ రిలీజ్ తర్వాత రజనీకాంత్ ఫ్యాన్స్ స్వయంగా ఈ సినిమా చూడొద్దు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు అంటూ వార్తలు వచ్చాయి. రజనీకాంత్ పరువు తీసే విధంగా ఐశ్వర్య ఈ సినిమాను రూపొందించారు. ఇలాంటి కథకు, ఇలాంటి మేకింగ్‌కు రజనీ సర్ ఎలా ఓకే చెప్పారో అర్థం కాలేదు అంటూ చాలా మంది సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రజనీకాంత్ వంటి సూపర్ స్టార్ చేయాల్సిన కథ కాదు, ఆయన స్థాయికి తగ్గట్లుగా స్క్రిన్‌ప్లే లేదు అంటూ విమర్శలు వచ్చాయి. లాల్ సలామ్ సినిమాకు వచ్చిన బజ్ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను భారీ మొత్తానికి కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది.
సినిమా మేకింగ్ దశలోనే నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను కొనుగోలు చేసింది. సినిమా డిజాస్టర్ కావడంతో నెట్‌ఫ్లిక్స్ సినిమాను వదిలించుకునేందుకు ప్రయత్నాలు చేసింది. అంతే కాకుండా ఈ సినిమాను రీ ఎడిట్ చేసి నెట్‌ఫ్లిక్స్‌కు ఇవ్వాలనే ఉద్దేశంతో కొన్ని సీన్స్‌ను ఐశ్వర్య తొలగించారు అనే ప్రచారం జరిగింది. అదే అదునుగా నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు తిరస్కరించింది. సుదీర్ఘ కాలంగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. లైకా వారు ఈ సినిమా ఓటీటీ రైట్స్ నెట్‌ఫ్లిక్స్‌కు అమ్మినా స్ట్రీమింగ్ మాత్రం కాలేదు. చెప్పినట్లుగా కాకుండా మరో రకంగా సినిమాను రూపొందించిన కారణంగా ఒప్పందం రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులు లైకా వారితో చెప్పినట్లు తెలుస్తోంది.
లాల్ సలామ్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసి వెనక్కి తగ్గడంతో ఇప్పుడు ఆ రైట్స్‌ను సన్ నెక్ట్స్ దక్కించుకున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. జూన్ 7వ తారీకున ఈ సినిమాను సన్ నెక్ట్స్ ఓటీటీ స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. థియేట్రికల్ రిలీజ్ అయిన దాదాపు ఏడాదిన్నర తర్వాత ఈ సినిమాను ఓటీటీలో తీసుకు రాబోతున్నారు. థియేట్రికల్ రిలీజ్ డిజాస్టర్ కావడంతో లాల్ సలామ్ సినిమాను చాలా మంది ఓటీటీలో తీసుకు రాకపోవడం మంచిదని భావించారు.
ముఖ్యంగా రజనీకాంత్ అభిమానులు లాల్ సలామ్ సినిమా ఓటీటీలో వస్తే రజనీ సర్‌తో పాటు ఐశ్వర్య మళ్లీ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే లాల్ సలామ్ ఓటీటీ స్ట్రీమింగ్ అప్‌డేట్ రాగానే బాబోయ్ సూపర్ స్టార్ సినిమా వస్తుందా అంటూ చాలా మంది షాక్ అవుతున్నారు. ఓటీటీ స్ట్రీమింగ్ తో ఈ సినిమాకు ఎలాంటి స్పందన దక్కుతుంది అనేది చూడాలి. లాల్ సలామ్ సినిమాలో రజనీకాంత్‌తో పాటు వివేక్ ప్రసన్న, విష్ణు విశాల్, విక్రాంత్, సెంథిల్‌లు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించడం విశేషం.