Begin typing your search above and press return to search.

మంచు డాటర్ వెకేషన్.. ఆ పిక్ అయితే వేరే లెవెల్!

లక్ష్మి బ్లాక్ అవుట్ ఫిట్ స్టన్నింగ్ గా ఉందని, మొత్తానికి మంచు డాటర్ మస్త్ గా ఎంజాయ్ చేస్తున్నారని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   11 Jan 2024 8:49 AM GMT
మంచు డాటర్ వెకేషన్.. ఆ పిక్ అయితే వేరే లెవెల్!
X

నటి మంచు లక్ష్మి, హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలిసిందే. వీరు తరచుగా వివిధ పార్టీల్లో ఎంజాయ్ చేస్తుంటారు. స్పెషల్ ఈవెంట్ లో కలుసుకుని సందడి చేస్తుంటారు. సూపర్ పోజులు ఇస్తూ ఫ్యాన్స్ కు ఫుల్ మజా ఇస్తుంటారు. అందుకు సంబంధించిన పిక్స్ మంచు లక్ష్మి ఎక్కువగా షేర్ చేస్తుంటుంది.


తాజాగా మంచు లక్ష్మి.. తన ఫ్రెండ్స్ తో వెకేషన్ కు వెళ్లిన పిక్స్ ను తన ఫ్యాన్స్ కోసం పంచుకుంది. ఫ్యామ్ తో వెకేషన్ మెమోరీస్ ను రివైండ్ చేసుకుంటున్నా అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఆ ఫొటోల్లో రకుల్, ప్రగ్యాతోపాటు బాలీవుడ్ నటి సీరత్ కపూర్ తదితరులు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. ఫ్యాన్స్ లైకుల వర్షం కురిపిస్తున్నారు.


ప్రగ్యా, రకుల్ తో మంచు లక్ష్మి దిగిన పిక్ అయితే వేరే లెవెల్ లో ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. లక్ష్మి బ్లాక్ అవుట్ ఫిట్ స్టన్నింగ్ గా ఉందని, మొత్తానికి మంచు డాటర్ మస్త్ గా ఎంజాయ్ చేస్తున్నారని చెబుతున్నారు. ఎప్పటికీ మీ ఫ్రెండ్ షిప్ ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నారు. పెద్ద గ్యాంగే మెయింటైన్ చేస్తున్నారని అంటున్నారు.


మంచు లక్ష్మి ప్రస్తుతం బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టింది. ఇటీవలే తన మకాం ముంబయికి మార్చేసింది. కొన్ని నెలల క్రితమే మంబయికి వెళ్లిపోయింది. అయితే కొన్ని రోజులు అక్కడికి, ఇక్కడికి ట్రావెల్ చేసిన లక్ష్మి.. ఇటీవలే పూర్తిగా షిఫ్ట్ అయింది. ముంబయిలో తనకు నచ్చిన విధంగా ఉండే ఓ ఇల్లు తీసుకున్నానని ఓ వీడియో కూడా చేసింది. తాను తీసుకున్న కొత్త ఇల్లును ఈ వీడియోలో చూపించింది.


నటిగా, నిర్మాతగా, యాంకర్ గా రాణించి మల్టీ టాలెంటెడ్ గా పేరు సంపాదించుకున్న మంచు లక్ష్మి.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. ముఖ్యంగా యూట్యూబ్ లో వీడియోలతో తెగ సందడి చేస్తోంది. 2022లో మోహన్‌ లాల్‌ నటించిన మాన్‌ స్టర్‌ మూవీతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం అగ్ని పర్వతం అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుంది.