Begin typing your search above and press return to search.

కలర్ఫుల్ మంచు లక్ష్మి.. హై గ్లామర్ ట్రీట్

కలర్ఫుల్ డ్రెస్సులో మంచు లక్ష్మి తన నడుము అందాలను ఎద అందాలతో సరికొత్తగా స్టిల్ ఇచ్చింది. ఇక ముఖ్యంగా ఆమె స్మైల్ కూడా ఆ ఫోటోలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

By:  Tupaki Desk   |   20 Feb 2024 11:30 AM GMT
కలర్ఫుల్ మంచు లక్ష్మి.. హై గ్లామర్ ట్రీట్
X

నిర్మాత గానే కాకుండా నటిగా యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న వారిలో మంచు లక్ష్మి కూడా టాప్ లిస్టులో ఉంటారు అని చెప్పవచ్చు. మొదట పలు రియాలిటీ షో లతో కూడా ఆమె చాలా బిజీగా కనిపించేవారు. ఇక ఆ తర్వాత నటిగా తనలోని సరికొత్త టాలెంట్ను బయటపెట్టింది. ఆమె మొదటి సినిమా అనగనగా ఒకదీరుడు కమర్షియల్ గా అంతగా సక్సెస్ కాక పోయినప్పటికీ నటిగా మాత్రం మంచు లక్ష్మి మంచి గుర్తింపును అందుకుంది.

ఇక తర్వాత నిర్మాతగా కూడా డిఫరెంట్ సినిమాలను నిర్మించే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా ఆమెకు పెద్దగా సక్సెస్ ఏమి రాలేదు. అయినప్పటికీ ఏమాత్రం నిరుత్సాహపడకుండా సరికొత్త తరహాలోనే ముందుకు సాగుతూ ఉన్నారు. ఇక సోషల్ మీడియాలోకి అడుగు పెట్టిన తర్వాత మంచు లక్ష్మి తన గ్లామర్ తో కూడా ఆశ్చర్యపరిచేలా దర్శనం ఇస్తోంది.

రీసెంట్ గా ఆమె మరోసారి హై గ్లామర్ తో ఫాలోవర్స్ కు షాక్ అయితే ఇచ్చింది. కలర్ఫుల్ డ్రెస్సులో మంచు లక్ష్మి తన నడుము అందాలను ఎద అందాలతో సరికొత్తగా స్టిల్ ఇచ్చింది. ఇక ముఖ్యంగా ఆమె స్మైల్ కూడా ఆ ఫోటోలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మంచు లక్ష్మి ఎలాంటి డ్రెస్ వేసినా కూడా అందంగా ఉంటుంది అంటూ ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

నటిగా అయితే ఆమె స్క్రీన్ పై పెద్దగా నిరుత్సాహ పరచలేదు. కాబట్టి మళ్ళీ వెండితెరపై డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించాలి అని ఫాలోవర్స్ కోరుకుంటున్నారు. ఇక మంచు లక్ష్మి మాత్రం సరైన కథ దొరికితే కానీ సినిమాలు చేయడానికి ఒప్పుకోవడం లేదు. అంతే కాకుండా కథ ఏదైనా సరే తన పాత్ర కూడా చాలా బలంగా ఉండాలి అని జాగ్రత్తలు తీసుకుంటుంది.

ఇక ఆ మధ్య లేడి ఓరియెంటెడ్ గా కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకుంది. కానీ మళ్ళీ ఏమైందో ఆ ప్రాజెక్టు గురించి ఆమె పెద్దగా అప్డేట్ అయితే ఇవ్వలేదు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ తరహాలో ఆమె తన ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటుంది. అంతే కాకుండా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా తన లైఫ్ స్టైల్ గురించి మరిన్ని విషయాలను షేర్ చేసుకుంటోంది. చూడాలి మరి అమ్మడు రాబోయే రోజుల్లో ఎలాంటి క్రేజ్ అందుకుంటుందో.