Begin typing your search above and press return to search.

24 వ‌య‌సుకే గుండెపోటుతో న‌టి మృతి

ల‌క్ష్మిక‌ చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఎత్తైన నిర్మాణాలు ప్రకృతి అందాలతో నిర్మలమైన సూర్యోదయ నేపథ్య చిత్రం హృదయాన్ని క‌దిలించింది

By:  Tupaki Desk   |   8 Dec 2023 9:48 AM GMT
24 వ‌య‌సుకే గుండెపోటుతో న‌టి మృతి
X

కేవ‌లం 24 వ‌య‌సుకే గుండెపోటుతో ప్ర‌ముఖ న‌టి మృతి చెందడం అభిమానుల‌ను క‌ల‌వ‌ర‌ప‌రిచింది. ప‌లు సినిమాలు, టెలిఫిల్మ్‌లలో ఆకట్టుకునే పాత్రలతో పాపుల‌రైన మ‌ల‌యాళ‌ నటి లక్ష్మీకా సజీవన్ షార్జాలో హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు.

అట్టడుగు వర్గాల పోరాటాలను వెలుగులోకి తెచ్చిన అత్యంత ప్రశంసలు పొందిన టెలిఫిల్మ్ 'కాక్క'లో లక్ష్మికా పాత్ర‌ చాలా గుర్తింపు పొందింది. త‌న‌ నటనకు విస్తృతమైన ప్రశంసలు లభించాయి. ప్రేక్షకుల నుండి ల‌క్ష్మికాకు గుర్తింపు, ప్రశంసలు లభించాయి.

ల‌క్ష్మిక‌ చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఎత్తైన నిర్మాణాలు ప్రకృతి అందాలతో నిర్మలమైన సూర్యోదయ నేపథ్య చిత్రం హృదయాన్ని క‌దిలించింది. దీనికి వేడెక్కించే శీర్షికను ల‌క్ష్మిక జోడించింది. ''చీకటిలో ఉన్నప్పటికీ కాంతిని ఆశిస్తున్నాను...(sic)!'' అనే ట్యాగ్ ఆలోచింప‌జేసింది. ఈ ట్యాగ్ లైన్- ఫోటోగ్రాఫ్ మ‌ర‌ణానికి ముందు ల‌క్ష్మికా ఆలోచ‌న‌ల‌ను ప్ర‌తిబింబిస్తూ పదునైన సూచ‌న‌గా క‌నిపించింది. యువ‌న‌టి శాశ్వతమైన శాంతిని కోరుకుంటూ హృదయపూర్వక సందేశాలను వ్యక్తీకరిస్తూ ఇలా హింట్ ఇచ్చింద‌ని భావిస్తున్నారు.

దుల్కర్ సల్మాన్ ఒరు యమందన్ ప్రేమకథ-పంచవర్ణతాతా-సౌదీ వెల్లక్క-పూజయమ్మ-ఉయరే-ఒరు కుట్టనాదన్ బ్లాగ్ -నిత్యహరిత నాయగన్ సినిమాల్లో ల‌క్ష్మికా స‌జీవ‌న్ న‌టించారు. కొచ్చిలోని వజవేలిల్‌కు చెందిన లక్ష్మిక తన బహుముఖ ప్రతిభతో ప‌రిశ్ర‌మ‌లో ఆక‌ర్షించారు. షార్జాలోని బ్యాంకింగ్ రంగంలో కూడా తనదైన ముద్ర వేసారు. లక్ష్మిక న‌టించిన‌ థ్రిల్లర్ 'కూన్' ఇటీవ‌ల విడుద‌లైంది. ప్రశాంత్ బి మొలికల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అమల్ మోహన్ రచించారు. విజీష్ మణి దర్శకత్వం వహించిన డ్రామా చిత్రం 'పూజయమ్మ'లో దేవయాని టీచర్ పాత్రలో స‌జీవ‌న్ న‌ట‌న‌కు సానుకూల స్పందన వచ్చింది. పాతిక అయినా నిండ‌కుండానే అనంత లోకాల‌కు చేరిన న‌టీమ‌ణిని త‌ల‌చుకుని బ‌రువెక్కిన హృద‌యాల‌తో అభిమానులు శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టిస్తున్నారు.