Begin typing your search above and press return to search.

గ్లామర్ లుక్ తో కట్టిపడేస్తున్న లక్ష్మీరాయ్..

లక్ష్మీరాయ్ కెరియర్ సినిమాల విషయానికి వస్తే.. పలు ప్రకటనల ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తమిళ మూవీ కర్క కసదర తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

By:  Tupaki Desk   |   27 Oct 2025 3:00 AM IST
గ్లామర్ లుక్ తో కట్టిపడేస్తున్న లక్ష్మీరాయ్..
X

లక్ష్మీరాయ్.. ఒకప్పుడు దక్షిణాది ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు.. చేసేది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన యాక్టింగ్ తో ఎంతోమందిని ఆకట్టుకుంది.అయితే అలాంటి లక్ష్మీరాయ్ తాజాగా తన హాట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తోంది.. బ్లాక్ డ్రెస్ వేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ.. లక్ష్మీరాయ్ గ్లామర్ షో చేస్తూ షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ గా మారాయి..

లక్ష్మీరాయ్ తన కిల్లింగ్ లుక్స్ తో హార్ట్ ఫోజ్ లతో కుర్ర కారుకు పిచ్చెక్కిస్తోంది. ఈ ఫోటోలు చూసిన ఫాలోవర్స్ ఫైర్ ఏమోజీలని షేర్ చేస్తూ పలు రకాల కామెంట్లు పెడుతున్నారు..ఈ హాట్ ఫోటోలకు క్యాప్షన్ గా సాఫ్ట్ హార్ట్.. షార్ప్ మైండ్.. అన్ షేకబుల్ స్పిరిట్ అంటూ పెట్టింది. ప్రస్తుతం లక్ష్మీ రాయ్ పోస్ట్ చేసిన ఈ ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి.. ఈ ముద్దుగుమ్మ హాట్ అందాలకు చాలామంది ఫిదా అవుతున్నారు. అలా తన అందాలతో కుర్రకారుకి వల వేస్తున్న ఈ ముద్దుగుమ్మకి ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినిమాల్లో ఆఫర్స్ అయితే రావడం లేదు.అలా సమయం దొరికితే చాలు ఇలా గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ ని పెంచుకునే పనిలో పడింది.

లక్ష్మీరాయ్ కెరియర్ సినిమాల విషయానికి వస్తే.. పలు ప్రకటనల ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తమిళ మూవీ కర్క కసదర తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో.. కాంచనమాల కేబుల్ టీవీ అనే సినిమాతో తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఈమెకు పేరు తెచ్చిన సినిమా అంటే బలుపు మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ ద్వారానే లక్ష్మీరాయ్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.ఎందుకంటే ఈ సినిమాలో లక్కీ లక్కీ రాయ్ అనే ఐటమ్ సాంగ్ తో ఈ హీరోయిన్ ఒక్కసారిగా ఫేమస్ అయింది.

ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాలో రత్తాలు రత్తాలు అనే ఐటమ్ సాంగ్ తో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది. అంతేకాకుండా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో తౌబా తౌబా అనే ఐటెం సాంగ్ కూడా చేసింది.అలా ఐటెం సాంగ్స్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణించిన ఈ ముద్దుగుమ్మ కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో హీరోయిన్ గా అనేక చిత్రాల్లో నటించింది. ఈ హీరోయిన్ తెలుగులో చేసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ మంచి గుర్తింపు సంపాదించింది.. ప్రస్తుతం ఈ హీరోయిన్ కి తెలుగులో ఆఫర్స్ లేకపోయినప్పటికీ కన్నడ,తమిళ, హిందీ, మలయాళ భాషల్లో మాత్రం హీరోయిన్ ఆఫర్స్ వస్తున్నాయి.