లక్ష్మి నరసింహా రీ రిలీజ్ కోసం కొత్త సాంగ్..!
నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన లక్ష్మి నరసింహా సినిమా రీ రిలీజ్ ప్లాన్ చేశారు.
By: Tupaki Desk | 5 Jun 2025 1:41 PMనందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన లక్ష్మి నరసింహా సినిమా రీ రిలీజ్ ప్లాన్ చేశారు. జయంత్ సి పరాన్జీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య సరసన ఆసిన్ హీరోయిన్ గా నటించింది. లక్ష్మి నరసిం హా సినిమా 2004 సంక్రాంతికి రిలీజై సక్సెస్ అందుకుంది. బాలయ్య నుంచి వచ్చిన మాస్ యాక్షన్ సినిమాగా వచ్చిన లక్ష్మి నరసింహా ఫ్యాన్స్ కి ఫుల్ మాస్ ఫీస్ట్ అందించింది. ఐతే స్టార్ సినిమాలు రీ రిలీజ్ అవుతున్న ఈ సందర్భంలో బాలకృష్ణ లక్ష్మి నరసింహా సినిమా రీ రిలీజ్ చేస్తున్నారు.
జూన్ 8న లక్ష్మి నరసింహా 4K వెర్షన్ రీ రిలీజ్ అవుతుంది. ఐతే రీ రిలీజ్ అంటే ఉన్నది ఉన్నట్టుగా కొంత ఎడిట్ చేసి రిలీజ్ చేస్తారు. కానీ బాలయ్య సినిమా అంటే ఒక రేంజ్ ఉండాలి కదా అందుకే లక్ష్మి నరసింహా రీ రిలీజ్ కోసం ఏకంగా ఒక సాంగ్ ని యాడ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. లక్ష్మి నరసింహా రీ రిలీజ్ కోసం ఒక స్పెషల్ సాంగ్ కంపోజ్ చేయించారు. ఈ సాంగ్ కి భీమ్స్ మ్యూజిక్ అందించగా చంద్రబోస్ లిరిక్స్ ఇచ్చారు.
మందేసినోడు ఘనుడు మ్యాన్షన్ హౌస్ వేసినోడు అంటూ వచ్చే ఈ సాంగ్ మాస్ ఫ్యాన్స్ కి ఇన్ స్టంట్ గా ఎక్కేస్తుంది. ఐతే ఈ సాంగ్ ని థియేటర్ లో ఎలా చూపిస్తారు అన్నది మాత్రం సస్పెన్సే. ఏది ఏమైనా ఇప్పటికే స్టార్ సినిమాలు చాలా రీ రిలీజ్ అయినా కూడా ఇలా కొత్త సాంగ్ ని పెట్టి రిలీజ్ చేయడం అది బాలకృష్ణ సినిమాకే సాధ్యమైంది.
ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో అఖండ 2 సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని తో మరో సినిమా లాక్ చేసుకున్నాడు. బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా రెండు రోజుల ముందే అంటే జూన్ 8న లక్ష్మి నరసింహా సినిమా రీ రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ రీ రిలీజ్ టైం లో నందమూరి ఫ్యాన్స్ హంగామా ఎలా ఉంటుందో చూడాలి.