మరోసారి హీటెక్కించే లుక్కుతో మంచు లక్ష్మి
ఈ ఫోటోల్లో ఆమె వేసిన ఫ్లోరల్ జాకెట్‌తో కూడిన అవుట్‌ఫిట్, ఘనత పొందిన డిజైనర్ గజల్ గుప్తా కౌచర్ నుంచి వచ్చినది.
By: Tupaki Desk | 10 May 2025 10:10 AM ISTలక్ష్మీ మంచు లేటెస్ట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అవుతోంది. బ్లాక్ స్కర్ట్, గ్లిట్టర్ బ్లౌజ్, ఫ్లోరల్ జాకెట్‌తో కూర్చుని ఇచ్చిన ఈ స్టయిల్ పిక్స్ చూసి అభిమానులు ఫిదా అయ్యారు. ఆమె లుక్‌లో కేవలం గ్లామర్ మాత్రమే కాదు, కాన్ఫిడెన్స్ కూడా కనిపిస్తోంది. ఈ లుక్‌ను ఆమె ఇలాంటి లుక్ లో ఉండడం నాకు చాలా ఇష్టం అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడం విశేషం.
లక్ష్మీ మంచు టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా హాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టిన నటి. 'అనగనగా ఒక ధీరుడు', 'గుండెల్లో గోదారి' వంటి చిత్రాల్లో తన ప్రతిభను చూపించింది. వెబ్ సిరీస్‌లు, టెలివిజన్ షోల్లో కూడా ఆమె తన టాలెంట్‌తో గుర్తింపు తెచ్చుకుంది. నిర్మాతగానూ ఆమెకి ప్రత్యేక స్థానం ఉంది.
ఈ ఫోటోల్లో ఆమె వేసిన ఫ్లోరల్ జాకెట్‌తో కూడిన అవుట్‌ఫిట్, ఘనత పొందిన డిజైనర్ గజల్ గుప్తా కౌచర్ నుంచి వచ్చినది. జ్యువెలరీ డీపా గూర్నాని డిజైన్ చేయగా, నిఖితా నిరంజన్ స్టైలింగ్ చేశారు. ఈ ఫోటోలు లక్ష్మీ గ్లామర్ పరిధిని, ఫ్యాషన్ ఎక్స్‌పెరిమెంట్స్‌పై ఉన్న ఆసక్తిని చూపిస్తున్నాయి. అందం అంటే కేవలం రూపం మాత్రమే కాదు, అటిట్యూడ్ కూడా అని లక్ష్మీ మరొసారి చూపించారు.
తన అందం, గ్లామర్‌తో పాటు ఎదిగిన కేరియర్‌తో లక్ష్మీ టాలీవుడ్‌లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. ఫ్యాషన్‌లో కొత్త ట్రైల్స్ చేయడంలో ఆమె ఎప్పుడూ ముందుండేలా ఉంటుంది. అభిమానులు ఈ లేటెస్ట్ ఫోటోలకు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. లక్ష్మీ మంచు ఇలా కొత్త లుక్స్‌లో కనిపిస్తే మరోసారి ఫ్యాన్స్‌కి ఫ్యాషన్ ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తుంది. ఈ ఫ్లోరల్ లుక్‌కి సోషల్ మీడియాలో ఇప్పటికే లక్షల లైకులు, కామెంట్స్ వస్తున్నాయి.