లాహోర్ 1947 సినిమాకి OP సిందూర్ కనెక్షన్
సినిమాలను తెరకెక్కించడం ఒకెత్తు.., వాటిని సరైన సమయంలో రిలీజ్ చేయడం మరొక ఎత్తు.
By: Tupaki Desk | 4 Jun 2025 5:00 AM ISTసినిమాలను తెరకెక్కించడం ఒకెత్తు.., వాటిని సరైన సమయంలో రిలీజ్ చేయడం మరొక ఎత్తు. ఇప్పుడు అనూహ్యంగా మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ - సన్నీడియోల్ బృందానికి అలాంటి ఒక మంచి అవకాశం వచ్చింది. చాలా కాలం క్రితమే బ్లాక్ బస్టర్ మూవీ `లాహోర్ 1947` సీక్వెల్ ని రెడీ చేసిన ఈ జోడీ, సరైన రిలీజ్ తేదీ కోసం వేచి చూస్తోంది. ఎట్టకేలకు అలాంటి ఒక మంచి తేదీ ఈ జోడీకి చిక్కిందని తెలిసింది.
నిజానికి `లాహోర్` చిత్రాన్ని ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం కానుకగా విడుదల చేస్తారని భావించారు. కానీ, అది వీలు పడలేదు. ఆ తర్వాత ఆగస్టు లో స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేసారు. నిజానికి ఇది సరైన టైమింగ్. కానీ ఇప్పటికే ఆలస్యమైన చిత్రం ఈసారి వాయిదా పడకూడదు.
అయితే లాహోర్ సినిమా రావడానికి ముందే ఆపరేషన్ సిందూర్ (ఓపి) యుద్ధం జరగడం యాథృచ్ఛికం. ఆ సినిమా కథాంశానికి ఆపరేషన్ సిందూర్ కి మధ్య ఒక కనెక్షన్ నిజంగా ఆసక్తిని కలిగిస్తోంది. ఇది హిందూ- ముస్లిముల మధ్య సంఘర్సణ. `లాహోర్ 1947`.. భారతదేశ విభజన నేపథ్యంలో పీరియడ్ డ్రామా. ఈ చిత్రం లక్నో నుండి లాహోర్ కు ఒక ముస్లిం కుటుంబం వలస వెళ్లాక, అక్కడ వారు ఒక భవనంలో నివసిస్తున్న ఒక హిందూ మహిళతో పరిచయం పెంచుకుటారు. ఆ తర్వాత వారి మధ్య ఏ జరిగింది అన్నదే సినిమా. హిందూ ముస్లిమ్ కాన్ ఫ్లిక్ట్ తో తెరకెక్కిన చిత్రమిది. ఇప్పుడు సీక్వెల్ రిలీజ్ సమయానికి హిందూ ముస్లిముల ఇష్యూతో ముడిపడిన `ఆపరేషన్ సిందూర్` గురించి చర్చ సాగుతోంది. ఈ కనెక్షన్ నిజంగా యాధృచ్ఛికం. అయితే అమీర్ ఖాన్ పై దేశ ప్రజల్లో ఎందుకనో వ్యతిరేకత నెలకొంది. అందువల్ల అతడు వ్యూహాత్మకంగా సైలెంట్ గా ఉంటున్నాడు. ఈ స మయంలో లాహోర్ 1947 చిత్రాన్ని విడుదల చేయడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇది రావడానికి ఇంకా సమయం ఉంది. ఆపరేషన్ సిందూర్ పై తన అభిప్రాయం చెప్పని అమీర్ ఖాన్ ని ప్రజలు క్షమించి వదిలేస్తేనే బెటర్. సినిమాలతో మతం కనెక్షన్ ని ముడిపెట్టి నాశనం చేయడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.