Begin typing your search above and press return to search.

స్టన్ అయ్యే గ్లామర్ తో బిగ్ బాస్ పాప

సీరియల్స్, సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకొని బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా పాపులర్ అయిన అందాల భామ లహరి శ్రీ.

By:  Tupaki Desk   |   15 Jan 2024 5:03 AM GMT
స్టన్ అయ్యే గ్లామర్ తో బిగ్ బాస్ పాప
X

సీరియల్స్, సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకొని బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా పాపులర్ అయిన అందాల భామ లహరి శ్రీ. బిగ్ బాస్ ద్వారా బ్యూటీకి మంచి గుర్తింపు వచ్చింది. కొన్ని చిన్న సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించే ఛాన్స్ లు సొంతం చేసుకుంది. ఓ విధంగా చాలా మంది నటీమణులకి బిగ్ బాస్ మంచి ఫేమ్ తీసుకొచ్చింది.


సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ ని బిగ్ బాస్ పెంచిందని చెప్పాలి. అయితే ఈ షో నుంచి బయటకి వచ్చిన తర్వాత లహరి శ్రీ మీడియాకి దూరంగా ఉంటుంది. కాని ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం ఫ్యాన్స్ కి అందుబాటులోనే ఉంటుంది. రెగ్యులర్ గా తనకి సంబందించిన ఫోటోలని షేర్ చేసుకుంటుంది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తెలుగమ్మాయిలు కూడా గ్లామర్ షో విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదనే సంగతి తెలిసిందే.


ఇన్ స్టాగ్రామ్ లో చాలా మంది అందాల భామలు రెగ్యులర్ గా హాట్ ఫోటోషూట్ లతో సందడి చేస్తూ మరింత పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు. బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన అరియానా గ్లోరి, ఆషురెడ్డి, దివి వాదిత్యా, సిరి హనుమంతు లాంటి తెలుగమ్మాయిలు గ్లామర్ బ్యూటీస్ గా మారిపోయారు. సినిమాలలో కూడా అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు.


అలాగే లహరి కూడా గ్లామర్ షో విషయంలో తగ్గేది లే అనేలా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ని కనువిందు చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఇండోనేసియాలో బాలికి వెకేషన్ కోసం వెళ్ళింది. అక్కడ స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతూ ఆ ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.


ఈ ఫోటోలు కాస్తా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇందులో గ్లామరస్ అందాలు హైలెట్ చేస్తూ వినోదాన్ని అందిస్తోంది. ఈ ఫోటోపై నెటిజన్లు నుంచి ఆసక్తికరమైన కామెంట్స్ కూడా రావడం విశేషం. లహరి శ్రీ ఫ్యాన్స్ మాత్రం ఈ ఫోటోలు అద్భుతంగా ఉన్నాయని పోస్టులు పెడుతున్నారు. మరి అమ్మడు సినిమాల్లో ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.