Begin typing your search above and press return to search.

బెల్లంకొండ కోసం లేడీ విల‌న్!

క్రెడిట్ అంతా త్రివిక్ర‌మ్ కి చెంద‌న‌డంతో? సాగర్ ప‌నిత‌నం కిల్ అయిన‌ట్లు అయింది.

By:  Tupaki Desk   |   8 Jan 2024 11:48 AM GMT
బెల్లంకొండ కోసం లేడీ విల‌న్!
X

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా సాగ‌ర్ .కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో `టైస‌న్ నాయుడు` అనే సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. `భీమ్లా నాయ‌క్` త‌ర్వాత సాగ‌ర్ కె. డైరెక్ట్ చేస్తున్న చిత్ర‌మిదే. ఆ హిట్ త‌ర్వాత సాగ‌ర్ స్టార్ డైరెక్ట‌ర్ల జాబితాలో చేరుతాడు? అంచ‌నాలు తెర‌పైకి వ‌చ్చాయిగానీ అది సాధ్య‌ప డ‌లేదు. క్రెడిట్ అంతా త్రివిక్ర‌మ్ కి చెంద‌న‌డంతో? సాగర్ ప‌నిత‌నం కిల్ అయిన‌ట్లు అయింది.

దీంతో సాగ‌ర్ చంద్ర త‌న మార్క్ కంటెంట్ తోనే హీరోల్ని తయారు చేస్తాన‌ని సాయి శ్రీనివాస్ ని రెడీ చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా సెట్స్ లో ఉంది. తాజాగా ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర కోసం ప్ర‌గ్యా జైశ్వాల్ ని ఎంపిక చేసార‌ని స‌మ‌చారం. ఇందులో అమ్మ‌డు నెగిటివ్ షెడ్ ఉన్న పాత్ర పోషిస్తుంద‌ని అంటున్నారు. మ‌రికొంత మంది విల‌నీగానే చూపించ‌బోతున్నార‌ని వినిపిస్తుంది.

మ‌రి అమ్మ‌డు విల‌నీగా క‌నిపిస్తుందా? కేవ‌లం కాసేపు క‌నిపించే నెగిటివ్ పాత్ర‌? అన్న‌ది క్లారిటీ రావాలి. ఇదే నిజ‌మైతే ప్ర‌గ్యాజైశ్వాల్ సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది అనుకోవ‌చ్చు. హీరోయిన్ గా రాణిం చాల‌ని ఎంతో ఆశ‌ప‌డింది. కొన్ని అవ‌కాశాలు బాగానే స‌ద్వినియోగం చేసుకుంది. ఖాతాలో విజ‌యాలు న‌మోద య్యాయి. కానీ ఎందుక‌నో అమ్మ‌డి కెరీర్ ఆశించిన విధంగా సాగలేదు. అవ‌కాశాల ప‌రంగా వెనుక‌బ‌డింది.

సెకెండ్ లీడ్స్ కే చాలా కాలం ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది. ఇప్పుడా ఛాన్సులు కూడా లేక‌పోవ‌డంతో కొత్త ట‌ర్నింగ్ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఇందులో నిజ‌మెంత అన్న‌ది ప్ర‌గ్యా ధృవీక‌రించాల్సి ఉంది. ఈ చిత్రాన్ని వినూత్న‌మైన యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో బెల్లంకొండ పోలీస్ శ‌క్తివంతమైన అధికారి పాత్ర పోషిస్తున్నాడు. ప్ర‌గ్యా గ‌తంలో సాయి శ్రీనివాస్ హీరోగా న‌టించిన `జ‌య జాన‌కి నాయ‌కి` లో ఆడిపాడిన సంగ‌తి తెలిసిందే.