Begin typing your search above and press return to search.

పూజాహెగ్డే తో లేడీ ఓరియేంటెడ్ షురూ!

ఆ సినిమా గ‌నుక స‌క్సెస్ అయి ఉంటే? బ‌హుశా అక్కడ బిజీ అయ్యేదేమో! కానీ తాను ఒక‌ట‌నుకుంటే స‌న్నివేశం మ‌రోలా ఎదురైంది.

By:  Tupaki Desk   |   2 Jan 2024 11:30 AM GMT
పూజాహెగ్డే తో లేడీ ఓరియేంటెడ్ షురూ!
X

బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే మ‌ళ్లీ టాలీవుడ్ ప్ర‌య‌త్నాల్లో బిజీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ లో రీ లాంచ్ అవ్వాల‌ని గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ప్ప‌టికీ అమ్మ‌డికి క‌లిసి రావ‌డం లేదు. గ‌తేడాది రిలీజ్ అయిన `కిసీకా బాయ్ కిసీకా జాన్` పై అంచ‌నాలు పెట్టుకున్నా..నిరాశ‌నే మిగిల్చింది. ఆ సినిమా గ‌నుక స‌క్సెస్ అయి ఉంటే? బ‌హుశా అక్కడ బిజీ అయ్యేదేమో! కానీ తాను ఒక‌ట‌నుకుంటే స‌న్నివేశం మ‌రోలా ఎదురైంది. దీంతో మ‌ళ్లీ సౌత్ సినిమాల‌పై దృష్టిపెడుతుంది.

ఈ నేప‌త్యంలో తెలుగులో త‌న‌కున్న ప‌రిచ‌యాలన్నింటిని మ‌ళ్లీ తెర‌పైకి తెస్తుంది. ఇప్ప‌టికే ఓ మూడు సినిమాల కోసం అమ్మ‌డి పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు వెలుగులోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా పూజా గురించి మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం వెలుగులోకి వ‌స్తోంది. కోలీవుడ్ లో కంబ్యాక్ ని ఏ కంగా లేడీ ఓరియేంటెడ్ చిత్రంతోనే ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. `కోబ్రా` ఫేం అజ‌య్ జ్ఞాన‌ముత్తు తో ఓ ఉమెన్ సెంట్రిక్ సినిమాకి స‌న్నాహాలు చేస్తోందిట‌.

ఇటీవ‌లే అజ‌య్ అమ్మ‌డికి మంచి లేడీ ఓరియేంటెండ్ స్టోరీ వినిపించి లాక్ చేయించిన‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. స్టోరీ ప‌ట్ల ఆమె కూడా చాలా ఆస‌క్తిగా ఉందిట‌. ప్ర‌స్తుతం అజ‌య్ హార‌ర్ థ్రిల్ల‌ర్ `డిమోంట్ కాల‌నీ -2` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. డిమోంట్ కాల‌నీ అప్ప‌ట్లో మంచి విజయం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాతో ఆయ‌న‌కు మంచి పేరొచ్చింది. ఈ నేప‌థ్యంలో సీక్వెల్ ని కూడా తెర‌కెక్కిస్తున్నారు. దీనిపైనా భారీ అంచ‌నాలున్నాయి.

స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో పూజాహెగ్డే తో లేడీ ఓరియేంటెడ్ ప్లానింగ్ కూడా ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే త‌మిళ్ లోనూ అమ్మ‌డు కొన్ని సినిమాలు చేసింది. త‌ల‌ప‌తి విజ‌య్ స‌ర‌స‌న `బీస్ట్` లో న‌టించింది. ఆ సినిమాతో విజ‌య్ మంచి స్నేహిత‌య్య‌డాడు. అలాగే అక్క‌డి ప‌రిశ్ర‌మలో మంచి ప‌రిచ‌యాలు పెరిగాయి. టాలీవుడ్ కంటే కోలీవుడ్ అంటేనే సొగ‌స‌రి ఎక్కువ ఆస‌క్తి చూపిస్తున్న‌ట్లు చాలా కాలంగా వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే.