Begin typing your search above and press return to search.

శ్రీలీల‌..సాయి ప‌ల్ల‌వితో లేడీ ఓరియేంటెడ్!

సాయి ప‌ల్ల‌వి ఎంత గొప్ప డాన్స‌రో చెప్పాల్సిన ప‌నిలేదు. శ‌రీరాన్ని విల్లులా వంచి డాన్సు చేయ‌గ‌ల గ్రేట్ డాన్స‌ర్

By:  Tupaki Desk   |   31 Oct 2023 12:30 PM GMT
శ్రీలీల‌..సాయి ప‌ల్ల‌వితో లేడీ ఓరియేంటెడ్!
X

సాయి ప‌ల్ల‌వి ఎంత గొప్ప డాన్స‌రో చెప్పాల్సిన ప‌నిలేదు. శ‌రీరాన్ని విల్లులా వంచి డాన్సు చేయ‌గ‌ల గ్రేట్ డాన్స‌ర్. న‌టికంటే ముందు ఆమె డాన్స‌ర్. త‌న‌లో ఆ ట్యాలెంట్ న‌టిని చేసాయి. డాన్స్ కాంపిటీష‌న్ లో పాల్గొని బుల్లి తెర‌పై స‌త్తా చాటింది. అటుపై న‌టిగానూ మంచి గుర్తింపు ద‌క్కించుకుంది. చాలా సెల‌క్టివ్ గా సినిమాలు చేస్తుంది. రొమాంటిక్ రోల్స్ కి నిర్మొహ మాటంగా నో చెప్పేస్తుంది. కంటెంట్ నీట్ గా ఉండేలా చూసుకుంటుంది.

ఇలా అమ్మ‌డిలో కొన్ని క్వాలిటీలు మిగ‌తా భామ‌ల నుంచి వేరు చేస్తున్నాయి. ప్ర‌స్తుతం అమ్మ‌డు తెలుగు..త‌మిళ్ లో సినిమాలు చేస్తుంది. అలాగే యంగ్ హీరోయిన్ శ్రీ లీల కూడా మంచి డాన్స‌ర్ అని తొలి సినిమాతోనే నిరూపించింది. పెళ్లి సంద‌డిలో సిగ్నెచ‌ర్ స్టెప్పుల‌తో ఆక‌ట్టుకుంది. అటుపై చేసిన సినిమాల న్నింటిలో హీరోల్నే డామినేట్ చేసింది. అలా శ్రీలీల టాలీవుడ్ లో ఓ బ్రాండ్ లా మారిపోయింది.

ఇప్పుడా భామ తెలుగు సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతుంది. ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది. వ‌రుస విజ‌యాలు అమ్మ‌డిని అగ్ర ప‌థాన కూర్చొబెట్టాయి. ఏ హీరోని క‌దిపినా శ్రీలీల సర‌స‌న సినిమా చేయాల్సిందే అంటున్నారు. ఆ రేంజ్ లో టాలీవుడ్ లో ఫేమ‌స్ అయిపోయింది. మ‌రి అలాంటి శ్రీలీల‌ని... సాయిప‌ల్ల‌వి లాంటి పెర్పార్మ‌ర్ల‌తో ఓ లేడీ ఓరియేంటెడ్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది? ఇద్ద‌రిలో డాన్సింగ్ ట్యాలెంట్ ప‌క్కాగా ఎగ్జిక్యూట్ చేయ‌గ‌ల్గితే? స‌క్సెస్ క‌దా? అన్న ఆలోచ‌న అగ్ర నిర్మాత దిల్ రాజుకి త‌ట్టిన‌ట్లు ఫిలిం స‌ర్కిల్స్ లో జోరుగా వినిపిస్తుంది.

ఇద్ద‌ర్నీ ఒకేతాటిపై తీసుకొచ్చి ఓ లేడి ఓరియేంటెడ్ సినిమా చేస్తే మంచి ఫ‌లితాలు సాధించొచ్చు అని ఆయ‌న భావిస్తున్నారుట‌. ఐడియా మంచిదే. ఇద్ద‌రు ప్ర‌తిభావంతులే. ఇద్ద‌రికీ యువ‌త‌లో మంచి క్రేజ్ ఉంది. ఇద్ద‌రిలో దాగి ఉన్న డాన్సింగ్ స్కిల్స్ ని బేస్ చేసుకుని ఓ క‌థ‌ని రాస్తే వ‌ర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. రాజుగారి ముందు ఆ ఛాన్స్ క‌నిపిస్తుంది. స‌రైన క‌థ‌తో వెళ్తే కొత్త వాళ్లు అయినా నో చెప్ప‌డం లేదు. ప్ర‌తిభా వంతుల్ని ప్రోత్స‌హించ‌డంలో రాజుగారు ఎప్పుడూ ముందుంటారు. ఇప్పుడాయ‌నే అలాంటి క‌థ కోసం ఎదురు చూస్తున్నారు. మ‌ళ్లీ మ‌ళ్లీ వ‌చ్చే ఛాన్స్ కాదు ఇది.