Begin typing your search above and press return to search.

ప్రేయసి కోసం నటుడు లేడీ గెటప్‌

బిగ్ బాస్ లోకి ప్రియాంక ఎంట్రీ ఇచ్చిన సమయంలో శివ కుమార్ ఆ వీడియోను షేర్ చేయడం జరిగింది.

By:  Tupaki Desk   |   5 Sep 2023 1:48 PM GMT
ప్రేయసి కోసం నటుడు లేడీ గెటప్‌
X

తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 లో మొదటి కంటెస్టెంట్‌ గా అడుగు పెట్టిన ప్రియాంక జైన్ అందరి దృష్టిని ఆకర్షించింది. సీరియల్‌ నటిగా గుర్తింపు దక్కించుకున్న ప్రియాంక ఈ మధ్య కాలంలో ఎక్కువగా యూట్యూబ్‌ లో సందడి చేసింది. ఆమె ప్రియుడు కూడా నటుడు అనే విషయం తెల్సిందే. గత కొన్నాళ్లుగా సీరియల్ నటుడు శివ కుమార్ తో ప్రియాంక రిలేషన్ లో ఉంది.

బిగ్‌ బాస్ లోకి సీరియల్‌ నటి అడుగు పెట్టిన సమయంలో శివ కుమార్‌ సోషల్‌ మీడియాలో సందడి చేశాడు. ప్రియురాలి కోసం శివ కుమార్‌ ఫ్రాంక్ ప్లాన్‌ చేశాడు. బిగ్ బాస్ లోకి ప్రియాంక ఎంట్రీ ఇచ్చిన సమయంలో శివ కుమార్ ఆ వీడియోను షేర్ చేయడం జరిగింది. యూట్యూబ్‌ లో ప్రస్తుతం ఆ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

సాదారణంగా ఎక్కువ గడ్డం మరియు మీసాలతో కనిపించే శివ కుమార్‌ ఫ్రాంక్ వీడియో కోసం గడ్డం మీసాలు తీసి వేసి లేడీ గెటప్ వేసుకున్నాడు. అతడి సాహసానికి అంతా కూడా ఫిదా అవుతున్నారు. మొదట ప్రియాంక ఆమెను గుర్తు పట్టదని అతడు భావించాడు. కానీ గెటప్ మార్చిన శివ కుమార్‌ తన గొంతును మాత్రం మార్చలేక పోయాడు.

ప్రస్తుతం బిగ్‌ బాస్‌ హౌస్ లో ఉన్న ప్రియాంక కి ఈ వీడియో కచ్చితంగా అదనపు బలం అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే విషయం కన్ఫర్మ్‌ అయిన సమయంలోనే చాలా మంది ఇలాంటి వీడియోలు చేసి పెట్టారు. ఇప్పుడు షేర్‌ చేసి హౌస్ లో ఉన్న వారికి ప్రమోషన్.. పబ్లిసిటీ అన్నట్లుగా చేస్తున్నారు.