సూపర్‌స్టార్ బర్త్ డే కేక్ వెళ 465కోట్లు
అవును.. సూపర్ స్టార్ బర్త్ డే కేక్ విలువ 465 కోట్లు. ఇంత ఖరీదైన కేక్ ఇంతకీ ఏ బ్రాండ్ ? అని ప్రశ్నించవద్దు.
By: Tupaki Desk | 15 May 2025 11:30 AMఅవును.. సూపర్ స్టార్ బర్త్ డే కేక్ విలువ 465 కోట్లు. ఇంత ఖరీదైన కేక్ ఇంతకీ ఏ బ్రాండ్ ? అని ప్రశ్నించవద్దు. ఈ కేక్ కి ఉన్న ప్రత్యేకతే అలాంటిది.. కేక్ పై రెండు సినిమాల వసూళ్లను అధికారికంగా ప్రదర్శించింది టీమ్. రెండిటినీ కలుపుకుంటే, అంత పెద్ద సంఖ్య నమోదైంది. ఎల్ 2 వసూళ్లు 265 కోట్లు, తుడరమ్ వసూళ్లు 200 కోట్లు కలుపుకుని మొత్తానికి మోహన్ లాల్ సంపాదించినది 465 కోట్లు అన్నమాట.
మలయాళంలో సూపర్ స్టార్ హోదాను ఆస్వాధిస్తున్న లాల్ సర్ తలుచుకుంటే బాక్సాఫీస్ షేకవుతుందని నిరూపణ అయింది. వయసు పెరిగే కొద్దీ తనలో ఎనర్జీకి కొదవేమీ లేదని నిరూపిస్తున్న ఈ మల్లూ స్టార్ నిజంగా దేశంలోని చాలామంది ఇతర స్టార్లకు ఒక స్ఫూర్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాలీవుడ్ లో ఖాన్‌లు, బచ్చన్‌లు సాధించలేని వసూళ్లు ఇవి.
అందుకే ఈసారి బర్త్ డేని కూడా అంతే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసారు. ఒకదానిపై ఒకటిగా జత చేసి రెండు కేక్ లతో డబుల్ ధమాకా సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేసారు. మోహన్ లాల్ కు డబుల్ విజయం నేపథ్యంలో రెండు అంచెల కేక్ తో సెలబ్రేట్ చేయడం సరైన ఆలోచన. పార్టీలో సూపర్ స్టార్ మోహన్ లాల్ భారీ విజయాలను ఎంతగానో ఆస్వాధించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. L2: ఎంపురాన్ నుండి స్టీఫెన్ నేడుంపల్లిగా, తుడారుమ్ లో బెంజ్ గా (వ్యంగ్య పాత్ర) అతడు సత్తా చాటాడు. ఎల్ 2 కి పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించగా, ఇది యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో మాలీవుడ్ రికార్డులు తిరగరాసింది.
ఇంతలో తరుణ్ మూర్తి దర్శకత్వం వహించిన ఉత్కంఠభరితమైన ఫ్యామిలీ డ్రామా `తుడారుమ్` బంపర్ హిట్ వసూళ్లతో అదరగొట్టింది. ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకులను ఆకట్టుకుని, రూ. 200 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో శోభన శక్తివంతమైన పాత్రలో అద్భుతంగా నటించారని పేరొచ్చింది. ఈ రెండు సినిమాలు మోహన్ లాల్ మ్యాజిక్ ను తిరిగి వెనక్కి తెచ్చాయి. ప్రస్తుతం మమ్ముట్టి - నయనతార కలిసి నటించిన MMNM అనే మెగా ప్రాజెక్ట్ చేస్తున్నారు. మరికొన్ని స్క్రిప్టుల్ని లాల్ లాక్ చేసారు. ఇతర సౌతిండియా చిత్రాల్లోను ఆయన నటించనున్నారు.