Begin typing your search above and press return to search.

మైత్రి - హోంబలే రేంజ్ లో KVN - టాప్ హీరోల నెక్స్ట్ సినిమాలన్నీ ఈ సంస్థలోనే..

దక్షిణ భారత సినిమా రంగంలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్న సంస్థల్లో కెవీఎన్ ప్రొడక్షన్స్ ముందువరుసలో ఉంది.

By:  M Prashanth   |   6 Aug 2025 12:59 PM IST
KVN Productions Sets Sights on Pan-India Domination
X

దక్షిణ భారత సినిమా రంగంలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్న సంస్థల్లో కెవీఎన్ ప్రొడక్షన్స్ ముందువరుసలో ఉంది. బెంగళూరులోని శాండల్‌వుడ్‌ నుంచి పుట్టిన ఈ బ్యానర్ ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్‌ను లక్ష్యంగా పెట్టుకొని, అన్ని ప్రధాన భాషల్లో భారీ ప్రాజెక్ట్స్‌పై దృష్టి పెట్టింది. ప్రారంభంలో చిన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన సంస్థ… ఇప్పుడు నిర్మాణ ఖర్చుల పరంగా, కంటెంట్ వైపు భారీగా పెట్టుబడి పెడుతోంది. నెంబర్ వన్ పాన్ ఇండియా నిర్మాణ సంస్థగా ఎదగాలన్న లక్ష్యంతో భారీ స్టార్ క్యాస్టింగ్ మీద ఫోకస్ పెడుతోంది.

కన్నడ, తమిళ్‌లో కెవీఎన్ బిగ్ ప్లాన్

సొంతంగా శాండల్‌వుడ్‌ నుంచి స్టార్ట్ చేసిన కెవీఎన్ ప్రొడక్షన్స్, మొదటిగా కన్నడ ఇండస్ట్రీలోనే రూట్ పక్కాగా సెట్ చేసుకుంది. అక్కడ స్టార్ హీరో యష్‌తో కలిసి పని చేయడమే కాకుండా, లేటెస్ట్ గా అతని నెక్స్ట్ చిత్రం ‘టాక్సిక్’కు సంయుక్తంగా నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. మరొక వైపు కోలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన కెవీఎన్, తమిళ స్టార్ హీరోలు సూర్య, విజయ్‌లను తమ ప్రాజెక్టుల కోసం లైన్‌లో పెట్టిన సంగతి ట్రేడ్‌లో హాట్ టాపిక్ గా మారింది. తమిళ్ ఇండస్ట్రీలో నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లాలంటే, ఈ ఇద్దరు హీరోల్ని లాక్ చేయడమే స్మార్ట్ మూవ్ అని అర్ధమవుతుంది.

తెలుగు మార్కెట్‌పై కెవీఎన్ ఫోకస్

తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు పాన్ ఇండియా విజన్‌కి మారింది. అదే సమయంలో కెవీఎన్ ప్రొడక్షన్స్ టాలీవుడ్‌పై ఫోకస్ పెట్టడం గమనార్హం. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, యంగ్ టైగర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ వంటి తెలుగు టాప్ హీరోలతో ప్రాజెక్టులు అనౌన్స్ చేయడం కోసం రెడీ అవుతోంది. ఒక్కో భాషలో ఒక్కో స్టార్‌తో డీల్ ఫిక్స్ చేయడం ద్వారా తమ బ్యానర్‌ను దేశవ్యాప్తంగా నిలబెట్టాలని యత్నిస్తోంది. తమిళ్‌లో ఆజిత్ కుమార్‌తో కూడా చర్చలు జరుపుతుండటం సంస్థ భవిష్యత్తులో మరిన్ని పెద్ద ప్రాజెక్టుల రూట్ ఖరారు చేస్తున్నట్లు కనిపిస్తోంది.

స్టార్ పవర్ స్ట్రాటజీ

కేవీఎన్ ప్రొడక్షన్స్ తీసుకుంటున్న ఈ దూకుడు ప్రస్తుత ట్రెండ్‌లో తప్పని మార్గంగా మారింది. ఒక్క భాషకే పరిమితం కాకుండా, మల్టీపుల్ లాంగ్వేజెస్‌లో పెద్ద హీరోలతో సినిమాలు చేయడం ద్వారా నిర్మాణ సంస్థలు తమ బిజినెస్ స్కేల్ పెంచుకుంటున్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ కూడా అదే మోడల్ ఫాలో అవుతోంది. ఇది మొదట హోంబాలే మైత్రీ మూవీ మేకర్స్ లాంటి సంస్థలు ఫాలో చేసిన వ్యూహమే అయినా, కెవీఎన్ ఇప్పుడు మరింత అగ్రెస్సివ్‌గా అడుగులు వేస్తోంది. లాంగ్ టెర్మ్ వ్యూహంగా చూసుకుంటే, ప్రతి భాషలో స్టార్లను లాక్ చేసుకోవడం స్మార్ట్ మూవ్‌గా చెప్పొచ్చు.

టాప్ డైరెక్టర్లతో డీల్

ఇక డైరెక్టర్ల విషయంలోనూ కెవీఎన్ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తోంది. కన్నడ, తమిళ, తెలుగు పరిశ్రమల టాప్ డైరెక్టర్లను అడ్వాన్స్ లైన్‌లో పెట్టినట్టు, అనేక మీడియా రిపోర్ట్స్‌లో వెల్లడైంది. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి బాబీ కొల్లి, చందూ మొండేటి లాంటి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్లను ఇప్పటికే తమ క్యాంప్‌లో అడ్వాన్స్ తీసుకుని ప్రాజెక్ట్‌లు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వీరి ద్వారానే మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో పెద్ద సినిమాలు పట్టాలెక్కించేందుకు స్కెచ్ వేస్తున్నారని ట్రేడ్ టాక్. ఇదే మాదిరి తమిళ, కన్నడ ఇండస్ట్రీల్లో కూడా అక్కడి టాప్ డైరెక్టర్లను రిజర్వ్ చేసుకుంటూ… తాము పెట్టుబడులకు తగ్గట్టుగా హై క్వాలిటీ కంటెంట్‌ను డెలివర్ చేయాలని కెవీఎన్ ప్రొడక్షన్స్ ముందుగా ప్లాన్ చేస్తోంది.