Begin typing your search above and press return to search.

యంగ్ హీరోయిన్ ని బాధపెట్టిన గుంటూరు కారం

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో కుషిత కల్లపు ఇంటరెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది. ఆ మధ్య పబ్ సంఘటన ద్వారా కుషిత సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది.

By:  Tupaki Desk   |   22 Feb 2024 4:21 AM GMT
యంగ్ హీరోయిన్ ని బాధపెట్టిన గుంటూరు కారం
X

ఈ మధ్యకాలంలో యుట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు చేస్తూ పాపులర్ అయిన తెలుగు ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గా ప్రమోషన్స్ పొంది సిల్వర్ స్క్రీన్ పై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే వైష్ణవి చైతన్య బేబీ మూవీతో స్టార్ యాక్టర్ గా మారిపోయింది. హారిక కూడా హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. మరో బ్యూటీ కుషిత కల్లపు కూడా హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

ఇప్పటికే చాంగురే బంగారు రాజా, మనోహరం సినిమాలలో ఆమె హీరోయిన్ గా నటించింది. బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్ కి జోడీగా బాబు నెంబర్ 1 బుల్ షిట్ గయ్ అనే మూవీ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో కుషిత కల్లపు ఇంటరెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది. ఆ మధ్య పబ్ సంఘటన ద్వారా కుషిత సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది.

అదే ఫేమ్ కుషితని హీరోయిన్ గా కూడా పరిచయం అయ్యేలా చేసింది. ఈ బ్యూటీ గుంటూరు కారం సినిమాలో కూడా నటించింది. గతంలో తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో కూడా గుంటూరు కారం సినిమా సెట్ లో ఉన్నానంటూ పోస్టులు పెట్టింది. దీనిపై జర్నలిస్ట్ ప్రశ్నించారు. గుంటూరు కారం సినిమాలో చేశామని చెప్పారు ఏ సీన్ లో మీరు కనిపించలేదు ఎందుకని అని అడిగారు.

నేను గుంటూరు కారం మూవీ కోసం నాలుగు రోజులు షూటింగ్ చేశాను. అయితే మూవీ చూసిన తర్వాత నా సీన్స్ అన్ని ఎడిటింగ్ లో తొలగించారు. ఇదే విషయాన్ని వారిని అడిగాను. అయితే సినిమాలన్న తర్వాత ఒక్కోసారి ఇలా జరుగుతూ ఉంటాయి. చేసేదేమీ ఉండదు. నా సీన్స్ తొలగించడానికి కచ్చితమైన కారణం అయితే నాకు తెలీదు.

కానీ ఒకసారి మూవీ రిలీజ్ అయ్యాక ఏమీ చేయలేము అంటూ కుషిత చెప్పుకొచ్చింది. గుంటూరు కారం సినిమాలో సీన్స్ తొలగించిన కూడా ఆమె నటించిన బాబు నెంబర్ 1 లో హీరోయిన్ గా మంచి స్క్రీన్ ప్రెజెన్స్ దొరికింది. ఈ మూవీ కుషితకి ఎంత వరకు సక్సెస్ ఇస్తుందనేది వేచి చూడాలి.