Begin typing your search above and press return to search.

ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్ సూపర్ హిట్..!

విజయ్ దేవరకొండ సమంత లీడ్ రోల్ లో శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఖుషి

By:  Tupaki Desk   |   16 Aug 2023 4:05 AM GMT
ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్ సూపర్ హిట్..!
X

విజయ్ దేవరకొండ సమంత లీడ్ రోల్ లో శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఖుషి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ ఫిక్స్ చేశారు. సినిమాకు మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ కాన్సర్ట్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి ఖుషి టీం అంతా వచ్చి సందడి చేశారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ, సమంత ఈ కాన్సర్ట్ కి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.

ఖుషి సినిమాలోని పాటలకు కాన్సర్ట్ లో డాన్స్ చేశారు విజయ్ సమంత. సినిమాను ప్రేక్షకుల్లో తీసుకెళ్లేందుకు మ్యూజిక్ ప్రధానంగా ఉంటుంది. అయితే ఖుషి నుంచి రిలీజైన అన్ని సాంగ్స్ ఆడియన్స్ ని అలరిస్తున్నాయి. సినిమా మ్యూజిక్ సంగీత ప్రియులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ మ్యూజికల్ కాన్సర్ట్ ఈవెంట్ లో సినిమా గురించి కూడా తమ అభిప్రాయాలను తెలియచేశారు చిత్ర యూనిట్. విజయ్ దేవరకొండ లో నవ్వు చూడాలని ఈ సినిమా చేశానని శివ నిర్వాణ చెప్పారని విజయ్ అన్నారు. అయితే తాను సమంత ముఖంలో నవ్వు చూడాలని కోరుతున్నానని అన్నారు.

ఈ సినిమా కోసం సమంత చాలా కష్టపడ్డారని.. ఆమె ముఖం లో ఈ సినిమా నవ్వులు తెప్పించాలని అన్నారు విజయ్. అంతేకాదు తన సినిమాలు కూడా నిరాశపరుస్తున్నాయని ఈ సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుందని అన్నారు. సినిమాకు మ్యూజిక్ అందించిన హేషం అబ్దుల్ కూడా తన బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారని అన్నారు విజయ్ దేవరకొండ. ఇక ఇదే ఈవెంట్ లో సమంత మాట్లాడుతూ మా పాటలను ప్రత్యక్షంగా ఎంజాయ్ చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఖుషి మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా నిర్మాతలు రవి, నవీన్ గారు నన్ను అర్థం చేసుకున్నారని అన్నారు సమంత.

విజయవాడలో సమంత ఇడ్లీ పెట్టే పరిస్థితి రాదు.. విజయ్ శివ ల ఇడ్లీ కేపబిలిటీ మీద తనకు డౌట్ ఉంది కానీ బ్లాక్ బస్టర్ తీసే విషయంపై సందేహం లేదని సమంత అన్నారు. మీకోసం ఆరోగ్యంగా తిరిగొస్తా బ్లాక్ బస్టర్స్ ఇస్తా అని సమంత అన్నారు. మ్యూజికల్ కాన్సర్ట్ లో డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ ప్రేమ పెళ్లి నేపథ్యంలో సినిమాలు ఎందుకు చేస్తున్నానో తనకే తెలియదు. తన జీవితంలోని వ్యక్తిగత విషయాలు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, ప్రేమలు వీటి మీదే కథ రాసుకుంటా ఖుషి సినిమా కూడా అలాంటి నేపథ్యంతో రాసుకున్న కథే. ఈ సినిమాలో విజయ్, సమంత అసలు కనిపించరు. విప్లవ్, ఆరాధ్యలే కనిపిస్తారు.

ఖుషి సినిమాలో ప్రతి సీన్ ప్రేక్షకులను హత్తుకునేలా ఉంటుందని అన్నారు డైరెక్టర్ శివ నిర్వాణ. మలయాళంలో హృదయం సినిమా చేసిన హేషం అబ్దుల్ వాహబ్ ఆ సినిమాతో సౌత్ ఆడియన్స్ ని ఫిదా అయ్యేలా చేశాడు. ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్ లో హృదయం సాంగ్స్ కూడా పర్ఫార్మ్ చేసి ఆడియన్స్ ని అలరించాడు హేషం అబ్దుల్ వాహబ్. రౌడీ ఫ్యాన్స్ హంగామాతో.. ఆడియన్స్ కేరింతలతో ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్ సూపర్ హిట్ అయ్యిందని చెప్పొచ్చు.