Begin typing your search above and press return to search.

అయ్యో.. ఖుషి ఇక కష్టమే?

కానీ లేటెస్ట్ వీక్ రెండు సినిమాలు కాస్త హడావిడి చేయడంతో ఇప్పుడు ఆ సినిమాకు డ్యామేజ్ అయిన అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   7 Sep 2023 2:22 PM GMT
అయ్యో.. ఖుషి ఇక కష్టమే?
X

గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఖుషి సినిమా మొదటి వీకెండ్ లో బాగానే కలెక్షన్స్ అందుకుంది. కానీ ఆ తర్వాత సోమవారం నుంచి మెల్లమెల్లగా కలెక్షన్స్ తగ్గుతున్నాయి. ఇక ఇప్పుడు నష్టాల బారిన పడకుండా ఎంతో కొంత వెనక్కి తెస్తుంది అని బయ్యర్లు ఆశపడ్డారు. కానీ లేటెస్ట్ వీక్ రెండు సినిమాలు కాస్త హడావిడి చేయడంతో ఇప్పుడు ఆ సినిమాకు డ్యామేజ్ అయిన అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

అనుష్క నటించిన తాజా చిత్రం మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి సినిమా ఇప్పడు సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. చాలా కాలం తర్వాత అనుష్క సినిమా రావడంతో ఫ్యాన్స్ కూడా మూవీ చూడటానికి క్యూలు కడుతున్నారు. దానికి కూడా మూవీకి పాజిటివ్ వస్తుండటంతో, కాసుల వర్షం కురవడం ఖాయమని తెలుస్తోంది. అనుష్క తో పాటు, నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్ మూవీకి సూపర్ ఫ్లస్ అయ్యాయని తెలుస్తోంది.

దీనితో పాటు షారూక్ ఖాన్ హీరోగా తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ సైతం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ మరీ అంత సూపర్ హిట్ అని చెప్పలేం. కానీ, మాస్ సినిమా అని చెప్పొచ్చు. మూవీలో యాక్షన్ సీన్స్ మాత్రం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతారని తెలుస్తోంది. ప్రస్తుతానికి అయితే, ఈ మూవీకి కూడా పాజిటివ్ టాక్ నడుస్తోంది.

అట్లీ మార్క్ డైరెక్షన్ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో ఈ సినిమా కూడా కాసుల వర్షం కురిపించే అవకాశం ఎక్కువగానే ఉంది. అయితే, ఈ రెండు సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో, సమంత, విజయ్ దేవరకొండల ఖుషీ మూవీ చిక్కుల్లో పడిపోతోంది. ఇప్పటికే, ఈ మూవీ విడుదలైనప్పటి నుంచి మక్సిడ్ టాక్ తెచ్చుుకుంది. ఈ వారం మొదట్లో కాస్త కలెక్షన్లు తగ్గాయి.

దీనికి తోడు, ఇప్పుడు జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలు మరింత దెబ్బేసేశాయి. ఈ రెండు వచ్చిన తర్వాత ఖుషీని చూసేవారు తగ్గిపోతారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ లెక్కన ఖుషీ మూవీ నష్టాలు చవిచూడక తప్పదు. తమిళ జనాలు చూసింతగా జవాన్ ని ఇక్కడ చూడకపోయినా, అనుష్క మూవీ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. అనుష్క హిట్టుతో సమంత మూవీ దగ్గరదగ్గరగా రూ.15కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలుస్తోంది.