Begin typing your search above and press return to search.

అమ్మ డ్రెస్‌లో మెరిసిన ఖుషి.. మొదటి సినిమా సెంటిమెంట్‌

తాజాగా ఆర్చీస్ సినిమా ప్రీమియర్‌ షో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రీమియర్‌ షో లో ఖుషి కపూర్‌ అరుదైన డ్రెస్‌ లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది.

By:  Tupaki Desk   |   6 Dec 2023 5:01 AM GMT
అమ్మ డ్రెస్‌లో మెరిసిన ఖుషి.. మొదటి సినిమా సెంటిమెంట్‌
X

బాలీవుడ్‌ తో పాటు సౌత్ లో కూడా స్టార్‌ ఇమేజ్ ను సొంతం చేసుకున్న దివంగత నటి అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ ఇప్పటికే హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకు పోతున్న విషయం తెల్సిందే. తాజాగా శ్రీదేవి రెండో కూతురు ఖుషి కపూర్ కూడా హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది.


ఖుషి కపూర్‌ ఎంట్రీ గురించి చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. సినిమాల్లో నటించకుండానే సోషల్‌ మీడియా ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న ఖుషీ కపూర్‌ ఇప్పుడు జోయా అక్తర్ దర్శకత్వంలో రూపొందిన ఆర్చీస్ సినిమాతో తెరంగేట్రం కు రెడీ అయింది.

తాజాగా ఆర్చీస్ సినిమా ప్రీమియర్‌ షో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రీమియర్‌ షో లో ఖుషి కపూర్‌ అరుదైన డ్రెస్‌ లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ డ్రెస్‌ తన తల్లి శ్రీదేవి దాదాపు పదేళ్ల క్రితం ధరించిన ఐకానిక్ గౌను అవ్వడంతో ఖుషి కార్యక్రమంలో స్పెషల్‌ అట్రాక్షన్‌ గా నిలిచింది అనడంలో సందేహం లేదు.

తన మొదటి సినిమా ప్రీమియర్‌ కి తల్లి గౌన్ ను ధరించడం సెంటిమెంట్ గా ఖుషి కపూర్‌ భావించినట్లుగా తెలుస్తోంది. తన తల్లి ఈ సమయంలో లేకున్నా కూడా ఆమె ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఉంటాయని ఖుషి మరియు జాన్వీ కపూర్‌ లు సన్నిహితుల వద్ద మాట్లాడినట్లుగా తెలుస్తోంది.

ఆర్చీస్ సినిమాలో ఖుషి కపూర్‌ తో పాటు సుహానా ఖాన్‌, వేదాంగ్‌ రైనా, అగస్త్య, మిహిర్ అహుజా, యువరాజ్ మెండా లు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో పలువురు స్టార్‌ కిడ్స్ ఉండటంతో అందరి దృష్టిని ఈ సినిమా ఆకర్షిస్తోంది.