Begin typing your search above and press return to search.

తొలి సినిమా రిలీజ్ కాకుండానే దూకుడు!

పాపుల‌ర్ బ్రాండ్ కోసం సంత‌కం చేసినందుకు భారీ ప్యాకేజీనే ఖుషీ అందుకుంటోంద‌ని కూడా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   13 Oct 2023 7:48 AM GMT
తొలి సినిమా రిలీజ్ కాకుండానే దూకుడు!
X

దీపిక‌, ఆలియా, క‌త్రిన, దిశా ప‌టానీ స‌హా ప‌లువురు అగ్ర క‌థానాయిక‌లు బ్రాండ్ల ప్ర‌చారంలో భారీగా ఆర్జిస్తున్న సంగ‌తి తెలిసిందే. కోట్లాది రూపాయ‌ల ప్యాకేజీలు అందుకుంటున్నారు. నేటిత‌రం క‌థానాయిక‌ల‌కు బ్రాండ్స్ వ‌ల‌లు వేస్తున్నాయి. ముఖ్యంగా న‌ట‌వార‌సురాళ్ల‌కు ఇంకా డెబ్యూ సినిమా రిలీజ్ కాకముందే త‌మ బ్రాండ్ల‌కు ప్ర‌చారం క‌ల్పించే అవ‌కాశాన్ని కార్పొరెట్ ఉత్ప‌త్తులు క‌ల్పిస్తున్నాయి. ఇప్పుడు ప్ర‌ముఖ విదేశీ బ్యూటీ ప్రొడ‌క్ట్ ప్రచార‌క‌ర్త‌గా ఖుషీ క‌పూర్ ఇంకా త‌న తొలి సినిమా విడుద‌ల కాక‌ముందే సంత‌కం చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అందం, ఫ్యాషన్, స్వీయ-సంరక్షణ ప్రపంచాలను ఒకచోట చేర్చిన అద్భుతమైన ఈవెంట్‌లో ఖుషీ కపూర్‌ని అధికారికంగా స్కిన్ - బాడీ కేర్ బ్రాండ్ సోల్ డి జనీరో అంబాసిడర్‌గా ప్రకటించారు. అత్యంత స్టైలిష్‌గా జరిగిన ఈ ఈవెంట్‌లో ఖుషీ కపూర్ ఆల్ పింక్ ఎంసెట్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. సిల్క్ పింక్ ర్యాప్ స్కర్ట్ -మ్యాచింగ్ పింక్ స్టిలెట్టోస్‌తో పింక్ కార్సెట్ లో క‌పూర్ సిస్ట‌ర్ హెడ్ ట‌ర్న‌ర్ గా మారింది. పాపుల‌ర్ బ్రాండ్ కోసం సంత‌కం చేసినందుకు భారీ ప్యాకేజీనే ఖుషీ అందుకుంటోంద‌ని కూడా తెలుస్తోంది. తాజాగా డిజ‌నీరోతో టైప్ పెట్టుకున్నందుకు ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ, ఖుషీ కపూర్ ఇలా పేర్కొంది. ``నేను సోల్ డి జనీరో కుటుంబంలో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నాను. ఈ డైనమిక్ బ్రాండ్‌కు ప్ర‌చార‌క‌ర్త‌గా ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఇది ప్రత్యేకంగా నీకాలో అందుబాటులో ఉంది!``అ ని తెలిపింది. సోల్ డి జనీరోతో ఖుషీ కపూర్ అనుబంధం నిస్సందేహంగా బ్రాండ్‌కు ఒక ముఖ్యమైన మలుపు.

ఖుషీ డెబ్యూపై ఆస‌క్తి

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి పెద్ద కుమార్తె జాన్వీ క‌పూర్ పెద్ద స్టార్ గా ఎదిగేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు జాన్వీ సోద‌రి ఖుషీ క‌పూర్ డెబ్యూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బోనీ- శ్రీదేవి కుమార్తె ఖుషీ కపూర్.. షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ .. అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా తొలిప‌రిచ‌య చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. జోయా అక్తర్ ద‌ర్శ‌క‌త్వంలో `ది ఆర్చీస్` పేరుతో ఇది తెర‌కెక్కింది. త్వ‌ర‌లోనే నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. త‌దుప‌రి ప‌లువురు అగ్ర ద‌ర్శ‌క‌నిర్మాత‌ల నుంచి ఖుషీ క‌పూర్ కి అవ‌కాశాలు వెతుక్కుంటూ వచ్చాయ‌న్న టాక్ కూడా వినిపిస్తోంది. ఖుషీతో పాటు న‌టిస్తున్న అమితాబ్ మ‌న‌వ‌డు అగ‌స్త్య ఇప్ప‌టికే రెండో సినిమాకి సంత‌కం చేసాడు.