Begin typing your search above and press return to search.

ఖుషి డే 1 కలెక్షన్స్.. లైగర్ కంటే ఎక్కువే కానీ..

ఇక విజయ్ దేవరకొండ మొదటి రోజు ఖుషి సినిమాతో ఏపీ తెలంగాణలో కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందుకున్నాడు అని చెప్పవచ్చు.

By:  Tupaki Desk   |   2 Sep 2023 6:41 AM GMT
ఖుషి డే 1 కలెక్షన్స్.. లైగర్ కంటే ఎక్కువే కానీ..
X

విజయ్ దేవరకొండ సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఖుషి సినిమా మొదటినుంచి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తూ బాక్సాఫీస్ వద్ద అంచనాలను అయితే పెంచేసింది. మ్యూజిక్ తో పాటు టీజర్ ట్రైలర్ అలాగే మరికొన్ని పోస్టర్లు కూడా జనాలను థియేటర్లకు వచ్చేలా చేశాయి. మొత్తానికి మొదటి రోజు అయితే చాలా ఏరియాలలో ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దర్శనమించింది.

ఇక విజయ్ దేవరకొండ మొదటి రోజు ఖుషి సినిమాతో ఏపీ తెలంగాణలో కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందుకున్నాడు అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా ఏరియాల వారిగా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే, ముందుగా నైజాం ఏరియాలో అత్యధికంగా 5.15 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకోగా సీడెడ్ లో 91 లక్షలు ఉత్తరాంధ్రలో 1.13 కోట్లు ఇలా మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ సినిమాకు 9.87 కోట్లు షేర్, 15.85 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

ఇక కర్ణాటక అలాగే రెస్టాఫ్ ఇండియా చూసుకుంటే అటువైపు నుంచి 85 లక్షలు రాబట్టిన ఈ సినిమా మిగతా భాషల్లో మాత్రం చాలా తక్కువగానే రెస్పాన్స్ అందుకుంది. పాన్ ఇండియా తరహాలో తమిళ్ హిందీ కన్నడ మలయాళం భాషల్లో కలుపుకుని మొదటి రోజు కేవలం 45 లక్షల మాత్రమే వచ్చాయి. ఇక ఓవర్సీస్ లో మాత్రం ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ అయితే అందుకుంది.

అటువైపు నుంచి ఫస్ట్ డే 4.24 షేర్ దక్కింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఖుషి సినిమా మొదటి రోజు 15.37 కోట్లు షేర్, 26.85 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఒక విధంగా ఇది విజయ్ దేవరకొండ కెరియర్ బెస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే లైగర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 9.50 కోట్ల రేంజ్ లోనే షేర్ కలెక్షన్స్ అయితే అందుకుంది.

ఇక ఇప్పుడు ఖుషి సినిమా ఏపీ తెలంగాణలో అంతకంటే ఎక్కువ స్థాయిలో షేర్ కలక్షన్స్ అందుకుంది. మిగతా భాషల్లో ఎలా ఉన్నా తెలుగులో మాత్రం రౌడి స్టార్ ప్రతి సినిమాతో తన మార్కెట్ను పెంచుకునే విధంగా అడుగులు వేస్తూ ఉన్నాడు. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 52 కోట్ల రేంజ్ లో అయితే ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఖుషి సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 53 కోట్లు. అంటే సినిమా లేటెస్ట్ కలెక్షన్స్ బట్టి ఇంకా 38 కోట్లకు పైగానే షేర్ కలెక్షన్స్ రావాల్సి ఉంది. మరి ఈ టార్గెట్ ను ఖుషి ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తుందో చూడాలి.