Begin typing your search above and press return to search.

ఖుషి.. సెన్సార్​ టాక్ ఎలా ఉందంటే..

తాజాగా ఈ మూవీ సెన్సార్​ పనులను పూర్తి చేసుకుంది. 'యు/ఏ' సర్టిఫికెట్​ను అందుకుంది

By:  Tupaki Desk   |   23 Aug 2023 8:00 AM GMT
ఖుషి.. సెన్సార్​ టాక్ ఎలా ఉందంటే..
X

ది విజయ్ దేవరకొండ - స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటించిన సినిమా 'ఖుషి'. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మరో తొమ్మిది రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 1న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో... పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్​ కానుంది.


తాజాగా ఈ మూవీ సెన్సార్​ పనులను పూర్తి చేసుకుంది. 'యు/ఏ' సర్టిఫికెట్​ను అందుకుంది. పెద్దలతో పాటు పిల్లలు కూడా సినిమా చూడొచ్చు అన్నమాట. ఇంకా ఈ సినిమా రన్ టైమ్ 165 నిమిషాలు అని సెన్సార్​ తెలిపింది. అంటే... రెండు గంటల 45 నిమిషాలు అన్నమాట. మూడు గంటలకు పావు గంట తక్కువ.

అయితే సెన్సార్​ నుంచి పాజిటివ్ రెస్పాన్స్​ వచ్చిన ఈ చిత్రంలో ఎంటర్​టైన్మెంట్​, ఫ్యామిలీ ఎమోషన్స్​, డ్రామా బాగా పండాయని సెన్సార్ బోర్డుకు చెందిన వర్గాలు తెలిపాయి. ఆరేళ్ల నుంచి 60ఏళ్ల వరకు ఆడియెన్స్(పెళ్లి కానీ వారు, పెళ్లైన వారు) వరకు ​ చూడదగ్గ సినిమా అని ఇప్పటికే దర్శకుడు శివ నిర్వాణ చెప్పిన సంగతి తెలిసిందే.

ఇకపోతే ఇప్పటికే రిలీజైన పోస్టర్స్​, సాంగ్స్, ట్రైలర్​లో విజయ్ దేవరకొండ, సమంత ల కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రతి సాంగ్​ చార్ట్ బస్టర్​గా నిలిచింది. సోషల్​మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి. ముఖ్యంగా మలయాళ మ్యూజిక్ డైరెక్టర్​ హేషామ్ అబ్దుల్ వహాబ్​ అందించిన సంగీతం బాగా ఆకట్టుకుంది. సినిమాలో జయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదతరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

రీసెంట్​గా ప్రమోషన్స్​లో భాగంగా మూవీటీమ్.. ​ ఖుషి మ్యూజిక్ కన్సర్ట్​ కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్​లో విజయ్​-సమంత స్టేజ్​ డ్యాన్స్​ బాగా హైలైట్​గా నిలిచింది. ప్రస్తుతం సమంత.. హాలీడేలో భాగంగా అమెరికా వెళ్లగా.. విజయ్​ ప్రమోషన్స్​లో పాల్గొంటున్నారు. శాకుంతలం-టక్ జగదీశ్​-లైగర్ వంటి డిజాస్టర్ల తర్వాత సమంత-శివ-విజయ్​ చేస్తున్న సినిమా ఇది. చూడాలి మరి ఈ ముగ్గురికి మూవీ ఎలాంటి హిట్ ఇస్తుందో..