Begin typing your search above and press return to search.

కుర్చీ మడత పెట్టి... ఇంకో రౌండ్

ఈ మధ్యకాలంలో ఓ పెద్ద హీరో సినిమాకు ఎక్కువగా నెగిటివ్ వార్తలు రావడం గుంటూరు కారం సినిమా విషయంలోనే జరిగింది

By:  Tupaki Desk   |   31 Dec 2023 4:28 AM GMT
కుర్చీ మడత పెట్టి... ఇంకో రౌండ్
X

ఈ మధ్యకాలంలో ఓ పెద్ద హీరో సినిమాకు ఎక్కువగా నెగిటివ్ వార్తలు రావడం గుంటూరు కారం సినిమా విషయంలోనే జరిగింది. ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్టు.. ఆర్టిస్టులు.. టెక్నీషియ‌న్లు..షెడ్యూళ్లు.. ఇలా ప‌లు విష‌యాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకోవడం మీద ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. ఇక ఈ మధ్యే సినిమా నుంచి రిలీజ్ చేసిన ఓ మై బేబీ పాట పాట మీద జరిగిన రచ్చ కూడా విదితమే. ఇవన్నీ చాలా ఉన్నట్లు లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి లాంచ్ చేసిన కుర్చీ మడత పెట్టి సాంగ్ ప్రోమో పెద్ద వివాదానికి దారితీసింది. సోషల్ మీడియాలో పాపులర్ అయిన బూతు మాటను పాట కోసం వాడుకోవడాన్ని చాలామంది తీవ్రంగా తప్పు పట్టారు. ప్రోమో లాంచ్ అయినప్పటి నుంచి దీని మీద రచ్చ జరుగుతోంది. అది కొంచెం సద్దుమణిగే లోపే ఫుల్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. దీంతో మరోమారు సోషల్ మీడియా వేడెక్కింది.

కుర్చీ మడత పెట్టి... తర్వాత వచ్చే బూతు పదాన్ని మ్యూట్ చేసినట్టుగా కనిపించినప్పటికీ హీరో హీరోయిన్ల హావభావాలు, స్తెప్పుల ద్వారా విషయం చెప్పకనే చెప్పేశారు. ఏదైనా చిన్న సినిమాలో ఈ ప్రయోగం జరిగితే జనం పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలో ఇలాంటి పాట పెట్టడమే అందరికీ అభ్యంతరకరంగా ఉంది. ఈ విషయంలో ఎంత సమర్థించుకుందామని చిత్ర బృందం ప్రయత్నించినప్పటికీ విమర్శలు ఆగట్లేదు. పబ్లిసిటీ, సక్సెస్ కోసం మహేష్, త్రివిక్రమ్ ఇంతగా తగ్గిపోతారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఈ పాట ట్యూన్ విషయంలోనూ విమర్శలు తప్పట్లేదు. ఆల్రెడీ సోషల్ మీడియాలో పాపులర్ అయిన కూ... అనే సౌండ్ తో కూడిన ట్యూన్ వాడుకోవడం, అలాగే అత్తారింటికి దారేది చిత్రంలోని కాటమరాయుడు సాంగ్ బీట్ ను రిపీట్ చేయడంతో తమన్ ను సోషల్ మీడియా జనాలు ఆడుకుంటున్నారు. మొత్తంగా కుర్చీ మడత పెట్టి సాంగ్ నెగెటివ్ గా అయినా సరే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయితే అవుతోంది.