Begin typing your search above and press return to search.

NBAలో మహేష్ కుర్చీ మోత.. ఇదెక్కడి మాస్ రా మావ!!

అయితే ఈ మూవీలోని కుర్చీ మడత పెట్టి సాంగ్ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   1 April 2024 7:28 AM GMT
NBAలో మహేష్ కుర్చీ మోత.. ఇదెక్కడి మాస్ రా మావ!!
X

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో ఈ ఏడాది సంక్రాంతి కానుకగా గుంటూరు కారం మూవీ వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా.. మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది. వసూళ్ళ పరంగా పర్వాలేదనిపించింది. మహేష్ మాస్ యాక్షన్ కు మంచి ప్రశంసలు దక్కాయి. కానీ త్రివిక్రమ్ మార్క్ మిస్ అయినట్లు రివ్యూలు వచ్చాయి.

అయితే ఈ మూవీలోని కుర్చీ మడత పెట్టి సాంగ్ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. లిరికల్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు కాస్త వ్యతిరేకత వచ్చినప్పటికీ.. ఆ తర్వాత దుమ్ముదులిపేసింది. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయింది. ఇన్ స్టాగ్రామ్ లో అయితే ఇక చెప్పక్కర్లేదు. ఎక్కడ చూసినా ఈ పాటకు రీల్సే. సినిమాలో మహేష్, శ్రీ లీల వేసిన మాస్ స్టెప్పులకు ప్రేక్షకులు ఊగిపోయారు.

ఇప్పటికే మన దేశంలో అనేక రాష్ట్రాలతోపాటు అన్ని ఫంక్షన్స్, కాలేజీ ఈవెంట్స్ లో ఈ సాంగ్ తెగ వినిపిస్తోంది. ఇప్పుడు ఏకంగా అమెరికాలో కూడా కుర్చీ మడత పెట్టేస్తున్నారు. యూఎస్ కు కూడా ఈ సాంగ్ వెళ్లిపోయింది. అమెరికాలో హ్యూస్టన్ లో జరుగుతున్న నేషనల్ బాస్కెట్ బాల్ గేమ్స్- NBAలో కుర్చీ మడత పెట్టి పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు ఫారిన్ డ్యాన్సర్లు. గేమ్ బ్రేక్ టైమ్ లో ఈ సాంగ్ కు చిందులేసి అలరించారు.

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ చక్కర్లు కొడుతోంది. గుంటూరు కారం మూవీ యూనిట్ కూడా తమ పేజ్ లో షేర్ చేసింది. ఇక మహేష్ అభిమానులు ఆగుతారా... నెట్టింట ఆ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. కుర్చీ మడత పెట్టి సాంగ్ కూడా ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాట లాగే మంచి క్రేజ్ దక్కించుకుంటుందని కామెంట్లు పెడుతున్నారు.

ఈ సాంగ్ కు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బాణీలు కట్టారు. రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ కు శ్రీకృష్ణ, సాహితి చాగంటి తమ గొంతుతో ప్రాణం పోశారు. ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ సాంగ్.. 150 మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. మరి రాబోయే రోజుల్లో కుర్చీ మడత పెట్టి సాంగ్ ఇంకా ఎలాంటి రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి.