ఆ కారణంతో ఇండస్ట్రీలోకి రాకూడదనుకున్నా
రీసెంట్ గా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అందులో తన కెరీర్ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు.
By: Tupaki Desk | 10 April 2025 9:15 AM ISTఇటీవల రిలీజై ఆడియన్స్ ను మెప్పించిన మలయాళ మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ. ఆ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నారు మలయాళ నటుడు కుంచకో బోబన్. రీసెంట్ గా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అందులో తన కెరీర్ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు.
యాక్టర్ గా ఇండస్ట్రీలో కుటుంబ వారసత్వాన్ని కంటిన్యూ చేయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్తున్న కుంచకో బోబన్, తమ ఫ్యామిలీ 1949 నుంచి సినీ రంగంలో రాణిస్తోందని, కేరళలో మొదటి స్టూడియో ఏర్పాటు చేసిన వ్యక్తి తన తాతయ్యేనని, తన తండ్రి కూడా చైల్డ్ ఆర్టిస్టుగా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్‌గా ఎన్నో సినిమాలు చేశారని ఆయన తెలిపారు.
వరుస ఫ్లాపుల వల్ల తమ కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని, ఫైనాన్షియల్ సమస్యల వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నామని, దాంతో తనకు సినీ ఇండస్ట్రీపై అసహ్యం వచ్చిందని, తమకు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నింటికీనీ ఇండస్ట్రీనే కారణమనుకుని పరిశ్రమను నిందించేవాడినని, ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని ఎప్పుడూ అనుకోలేదని ఆయన తెలిపారు.
తాను ఒకటి అనుకుంటే విధి మరోలా రాసిందని, యాక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కెరీర్లో ఎన్నో లవ్, ఫ్యామిలీ సినిమాలు చేసి ఆడియన్స్ ఆదరాభిమానాలు సొంతం చేసుకున్నట్టు కుంచకో తెలిపారు. ఇక ఆఫీసన్ ఆన్ డ్యూటీ సినిమా గురించి మాట్లాడుతూ ఆ సినిమా తనకెంతో స్పెషల్ అని, ఆ సినిమాలో పోలీసాఫీసర్ గా నటించడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని ఆయన వెల్లడించారు.
కెరీర్ స్టార్టింగ్ లో తాను కేవలం లవ్ ఎంటర్టైనర్స్ మాత్రమే చేయడం వల్ల అలాంటి సినిమాల్లోనే యాక్ట్ చేస్తాననుకున్నారని, దాంతో చేసేదేం లేక కెరీర్ నుంచి కొంత కాలం బ్రేక్ తీసుకుని, ఆ తర్వాత డిఫరెంట్ రోల్స్ సెలెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్లినట్టు ఆయన తెలిపారు. తన కెరీర్లో మొదటిగా స్కూల్ బస్ సినిమా కోసం పోలీస్ పాత్రలో నటించానని ఆ సినిమా తనకు మంచి పేరుని తెచ్చిపెట్టిందని కుంచకో బోబన్ తెలిపారు.
