Begin typing your search above and press return to search.

కూతుర్ని రెక‌మెండ్ చేయ‌ని ఫేమ‌స్ సినిమాటోగ్రాఫ‌ర్!

కేర‌ళ కుట్టి మాళ‌వికా మోహ‌న‌న్ 'రాజాసాబ్' తో టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   28 March 2024 5:30 PM GMT
కూతుర్ని రెక‌మెండ్ చేయ‌ని ఫేమ‌స్ సినిమాటోగ్రాఫ‌ర్!
X

కేర‌ళ కుట్టి మాళ‌వికా మోహ‌న‌న్ 'రాజాసాబ్' తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే. తొలి సినిమా తోనే ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తో న‌టించే అరుదైన అవ‌కావం ఒడిసిప‌ట్టుకుంది. ఈ విష‌యం లో అమ్మ‌డు ఎంతో ల‌క్కీ గాళ్. ఎంతో మంది స్టార్ హీరోయిన్లే డార్లింగ్ తో రొమాన్స్ కోసం ఎదురు చూస్తుంటే? మారుతి పుణ్య‌మాని? ఆ ఛాన్స్ చాలా ఈజీగా ద‌క్కించుకుంది. ఈసినిమా హిట్ అయితే మాళ‌విక కెరీర్ వెనక్కి చూడ‌కుండా సాగిపోతుంది.

ఇప్ప‌టికే మ‌ల‌యాళం..తమిళ్ లో కొన్ని సినిమాలు చేసింది. బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇలా మ‌ల్టీలాంగ్వేజెస్ లో న‌టిస్తూ త‌న‌కంటూ ఓ ఐడెంటిటీని సంపాదిం చుకుంది. మ‌రి ఈ భామ ఫేమ‌స్ సినిమాటోగ్రాఫ‌ర్ కె.యు మోహ‌న‌న్ కుమార్తె అని ఎంత మందికి తెలుసు? అంటే ఇండ‌స్ట్రీలో ఉన్న అతికొద్ది మందికి త‌ప్ప‌! మాళ‌విక ఎవ‌రు? అన్న‌ది ఇంత‌వ‌ర‌కూ ఎవ‌రికీ తెలియ దు. ప్ర‌స్తుతం మోహ‌న‌న్ 'ఫ్యామిలీ స్టార్' సినిమాకి సినిమాటోగ్రాఫ‌ర్ గా ప‌నిచేయ‌డంతో ఇండ‌స్ట్రీలో ఈ విష‌యం వైర‌ల్ గా మారింది.

మోహ‌న‌న్ బాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోల‌తో ప‌నిచేసారు. తెలుగులోనూ అగ్ర హీరోల సినిమాల‌కు సినిమాటోగ్రాఫ‌ర్ గా ప‌ని చేసారు. మ‌రి ఇంత పేరున్న ఫేమ‌స్ కెమెరా మ్యాన్ కుమార్తె విష‌యంలో ఏదైనా ఛాన్స్ తీసుకున్నారా? అంటే లేద‌నే చెబుతున్నారాయ‌న‌. ఇప్ప‌టివ‌ర‌కూ మాళ‌విక న‌టించిన సినిమాల‌న్నీ త‌న‌కు తానుగానే ఛాన్సులు ద‌క్కించుకుందిట‌. ఎక్క‌డా తండ్రి పేరు వాడ‌టం కానీ..రిక‌మండ్ చేయండి అడ‌గ‌డం కానీ చేయ‌లేదుట‌.

ఈ విష‌యాన్ని స్వ‌యంగా మోహ‌న‌న్ రివీల్ చేసారు. 'న‌టిగా తానేంటో నిరూపించుకునే ప‌నిలో ఉంది. ఇండ‌స్ట్రీలో ఎవ‌రికివారుగా సొంతంగా ఎద‌గాల్సిందే. రికమండీష‌న్స్ అనేవి కేవ‌లం ఒక‌టి రెండు చిత్రాల‌కే త‌ప్ప ఆ త‌ర్వాత తోనే ఛాన్సులు సాధ్య‌మ‌వుతాయి. ఆ విష‌యం ఇద్ద‌రికీ బాగా తెలుసు . అందుకే త‌ను కానీ...నేను కానీ ఏ రోజు అవ‌కాశాల గురించి ఇంట్లో మాట్లాడుకుంది లేద‌ని' తెలిపారు.