Begin typing your search above and press return to search.

కుమారి శ్రీమతిగా నిత్యా మేనన్.. అస్సలు భయంలేదట

ఈ మోషన్ పోస్టర్ డిఫరెంట్ గా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఇందులో నిత్యా మేనన్‌ పాత్రను పరిచయం చేశారు మేకర్స్.

By:  Tupaki Desk   |   16 Sep 2023 5:04 PM GMT
కుమారి శ్రీమతిగా నిత్యా మేనన్.. అస్సలు భయంలేదట
X

ప్రముఖ హీరోయిన్ నిత్యామేనన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ కుమారి శ్రీమతి. లేడీ ఓరియెంటెడ్‌ ప్రాజెక్ట్‌గా ఇది తెరకెక్కుతోంది. ఈ సిరీస్ తో గోమటేశ్‌ ఉపాధ్యే దర్శకుడిగా పరిచయం కానున్నారు. వైజయంతి మూవీస్‌, స్వప్నా సినిమాస్‌ సంయుక్తంగా దీన్ని నిర్మిస్తున్నాయి. స్పప్న దత్, ప్రియాంక దత్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది.

ఈ మోషన్ పోస్టర్ డిఫరెంట్ గా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఇందులో నిత్యా మేనన్‌ పాత్రను పరిచయం చేశారు మేకర్స్. దేనికి భయపడకుండా తన కాళ్లపై తాను సొంతంగా నిలబడే ఓ ఇండిపెండెంట్ గా ఉండే యువతి పాత్రలో ఆమె కనిపించనున్నట్లు ఈ మోషన్ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది.

చుటూ పక్కన ఉన్న వాళ్లంతా.. నిత్యామేనన్ పాత్ర గురించి గుసగుసలు చెప్పుకుంటున్నట్లుగా బ్యాక్ గ్రౌండ్ లో వాయిస్ ప్లే చేశారు. అబ్దల్ కలాం, రజనీ కాంత్ తర్వాత ఈమెనంట. ఉద్యోగం చేయదట. సొంతంగా వ్యాపారం చేస్తుందట. కుటుంబం మొత్తాన్ని తానే చూసుకుంటుందట. అస్సలు పెళ్లి చేసుకోదట.. తనే కుమారి శ్రీమతి అంటా.. అంటూ నిత్యా మేనన్ పాత్రను బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో రివీల్ చేయడం ఇంట్రెస్టింగ్ గా సాగింది.

ఇకపోతే ఈ వెబ్ సిరీస్ ను తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో త్వరలోనే అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. మొత్తం 7 ఎపిసోడ్లుగా రానుందట. శ్రీనివాస అవసరాలా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. కామెడీ డ్రామాగా రానుంది. మోహన్ కృష్ణ కెమెరా వర్క్ చూసుకోనున్నారు. స్టకాటో( Staccato), కమ్రన్ సంగీతం అందిస్తున్నారు.

ఇక నిత్యామేనన్‌ సినిమాల విషయానికి వస్తే.. ఆమె అలా మొదలైందితో టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. తక్కువ కాలంలోనే ఎన్నో ప్రేమకథా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. భిన్న పాత్రలు పోషిస్తూ తెలుగు వారికి బాగా చేరువయ్యారు. తెలుగులో చివరిసారిగా పవన్ కల్యాణ్ భీమ్లానాయక్‌ లో నటించారు. ఆ ’ తర్వాత ఆమె తెలుగులో ఏ సినిమాలోనూ కనిపించలేదు.