Begin typing your search above and press return to search.

నెట్‌ ఫ్లిక్స్‌ లో కుమారి ఆంటీ...!

ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ తో ప్రముఖ ఓటీటీ నెట్‌ ఫ్లిక్స్ లో ఒక డాక్యుమెంటరీని తీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో కుమారి ఆంటీనే కనిపించబోతున్నారు.

By:  Tupaki Desk   |   6 Feb 2024 9:17 AM GMT
నెట్‌ ఫ్లిక్స్‌ లో కుమారి ఆంటీ...!
X

కుమారి ఆంటీ... తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు, ఆమె గురించి తెలియన వారు ఉండరు అనడంలో సందేహం లేదు. 13 ఏళ్లుగా రోడ్డు పై ఫుడ్ కోర్ట్‌ నడిపిస్తున్న సాయి కుమారి అలియాస్ కుమారి ఆంటీ గత మూడు నెలల కాలంలో అనూహ్యంగా పాపులారిటీని సొంతం చేసుకుంది.

ఆమె తన ఫుడ్‌ కోర్ట్‌ కు వచ్చే వారితో చక్కగా మర్యాదగా మాట్లాడుతూ వారికి కావాల్సిన ఆహార పదార్థాలు అందిస్తూ ఉండటం వల్ల చాలా మంది ఆమెను అభిమానిస్తూ ఉండేవారు. అలా ఆమె చాలా మంది అభిమానం సొంతం చేసుకుంది. మెల్ల మెల్లగా ఆమె యూట్యూబ్‌ ద్వారా ఫేమస్ అయ్యి మరింతగా ఆమె వద్దకు జనాలు వచ్చేలా పరిస్థితి మారింది.

ఆ మధ్య రోడ్డు పై ట్రాఫిక్ జామ్‌ అవుతుందని, ఆమె ఫుడ్ కోర్ట్‌ ను పోలీసులు మూసి వేయించడం.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆమె ఫుడ్‌ కోర్ట్‌ ను మళ్లీ తెరిపించడం మాత్రమే కాకుండా త్వరలో కుమారి ఆంటి ఫుడ్‌ కోర్ట్‌ వద్దకు వెళ్తాను అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇదంతా కూడా నాటకీయంగా అనిపిస్తున్న జరిగిన సత్యం.

ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ తో ప్రముఖ ఓటీటీ నెట్‌ ఫ్లిక్స్ లో ఒక డాక్యుమెంటరీని తీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో కుమారి ఆంటీనే కనిపించబోతున్నారు. ఈ మధ్య నెట్‌ ఫ్లిక్స్ లో కర్రీ అండ్‌ సైనైడ్ అనే డాక్యుమెంటరీ బాగా హిట్ అయ్యింది. అందుకే నెట్‌ ఫ్లిక్స్ మరిన్ని డాక్యుమెంటరీలను తీసుకు వచ్చేందుకు రెడీ అవుతోందట.

అందులో భాగంగానే నెట్‌ ఫ్లిక్స్ వారు కుమారి ఆంటీ పై ఒక డాక్యుమెంటరీని కాస్త సినిమాటిక్ గా తీస్తే బాగుంటుంది అనే నిర్ణయానికి వచ్చారు అంటూ సమాచారం అందుతోంది. భారీ మొత్తంలో కుమారి ఆంటీకి పారితోషికం ఇచ్చేందుకు కూడా నెట్‌ ఫ్లిక్స్ వారు ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి త్వరలో ఓటీటీలో కూడా కుమారి ఆంటీ సందడి చేయబోతుంది.