Begin typing your search above and press return to search.

కుమారి ఆంటీ క్రేజ్ వాడేస్తున్నారుగా..?

దాని వల్ల ఆమె నడిపిస్తున్న ఫుడ్ స్టాల్ ని కూడా తీసేసే పరిస్థితి ఏర్పడింది.

By:  Tupaki Desk   |   11 March 2024 10:19 AM GMT
కుమారి ఆంటీ క్రేజ్ వాడేస్తున్నారుగా..?
X

ఈమధ్య కాలంలో సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిన కుమారి ఆంటీ ని వాళ్లు వీళ్లు అని కాదు ఎవరు పడితే వారు వాడేస్తున్నారు. హైదరాబాద్ కొండాపూర్ ఏరియాలో ఒక ఫుడ్ స్టాల్ నడిపే కుమారి ఆంటీ వెయ్యి రూపాయలకు రెండు లివర్లు ఎక్స్ ట్రా అనే మాటతో సూపర్ పాపులర్ అయ్యింది. సోషల్ మీడియా ప్రభావం వల్ల ఆమెను నెటిజన్లు సూపర్ పాపులర్ చేశారు. దాని వల్ల ఆమె నడిపిస్తున్న ఫుడ్ స్టాల్ ని కూడా తీసేసే పరిస్థితి ఏర్పడింది.

ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని కుమారి ఆంటీకి అభయం ఇచ్చాడు. ఇలా దాదాపు నెల రోజుల నుంచి కుమారి ఆంటీ సోషల్ మీడియా సంచలనంగా మారగా ఆమె క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు అందరు ప్రయత్నిస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన లవ్ స్టోరీ మూవీ 'ప్రేమలు' లో కూడా కుమారి ఆంటీ ప్రస్తావన రాగా.. టీవీ ఛానెల్స్ వారు కూడా ఆమె క్రేజ్ వాడేస్తున్నారు.

ఇప్పటికే స్టార్ మా లో కుమారి ఆంటీ ఒక ఈవెంట్ లో గెస్ట్ గా రాగా.. లేటెస్ట్ గా జీ తెలుగు సీరియల్ లో గెస్ట్ అప్పియరెన్స్ తో సర్ ప్రైజ్ ఇచ్చింది. జీ తెలుగులో ప్రసారం అవుతున్న రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ సీరియల్ లో కుమారి ఆంటీ కనిపించింది. లేటెస్ట్ గా వదిలిన సీరియల్ ప్రోమోలో ఈశ్వరికి సపోర్ట్ గా కుమారి ఆంటీ నిలిచింది.

సోషల్ మీడియా వల్ల కుమారి ఆంటీ సూపర్ పాపులర్ అయ్యింది. అయితే ఆమె పాపులారిటీని వాడుకునేందుకు సీరియల్స్ వారు ముందుకొస్తున్నారు. చిన్నగా ఆమెకు సీరియల్ లో నటించే అవకాశం కూడా ఇస్తారని చెప్పొచ్చు. ప్రస్తుతానికి గెస్ట్ రోల్ ఇచ్చినా తర్వాత ఆమెకు ఇంట్రెస్ట్ ఉంటే సీరియల్స్ ఆఫర్స్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఫుడ్ స్టాల్ నడిపించే కుమారి ఆంటీ సీరియల్ లో గెస్ట్ రోల్ చేస్తుందని ఎవరు ఊహించి ఉండరు. మొన్నటిదాకా వార్తల్లో నిలిచిన కుమారి ఆంటీ ఇప్పుడు సీరియల్స్ లోకి వచ్చేసింది. అయితే రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ టీం కుమారి ఆంటీ క్రేజ్ ని వాడుకోవాలని చేసిన ప్రయత్నం మెప్పించేలా ఉంది. ఈ ప్రోమో చూశాక కుమారి ఆంటీకి వరుస సీరియల్ ఆఫర్లు క్యూ కట్టేస్తాయని చెప్పొచ్చు.