Begin typing your search above and press return to search.

కుభేర.. అసలు ఘట్టం మొదలెట్టాడు

ఈ పోస్టర్ లో ధనుష్ ఒక పైప్ లైన్ పై నిలబడి సిటీ వైపు చూస్తున్నట్లు స్టిల్ ఉంది. 12 రోజుల పాటు ముంబై షెడ్యూల్ ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.

By:  Tupaki Desk   |   26 April 2024 4:55 AM GMT
కుభేర.. అసలు ఘట్టం మొదలెట్టాడు
X

క్లాస్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. అతని సినిమా అంటే ఫీల్ గుడ్ ఎమోషన్ ఉంటుందనే అభిప్రాయం ఆడియన్స్ లో ఉంది. అతని కథలలో పాత్రల చిత్రణ అద్భుతంగా ఉంటుందనే టాక్ కూడా ఉంది. ముఖ్యంగా హీరోయిన్ పాత్రలకి మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఆయన చివరిగా చైతూ, సాయి పల్లవి జోడీగా లవ్ స్టోరీతో హిట్ కొట్టారు.

ఆ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ధనుష్ హీరోగా కుభేర సినిమాని స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు శేఖర్ కమ్ముల చేసిన క్లాస్ టచ్ తో కాకుండా కంప్లీట్ మాస్ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథ ఉండబోతోందని ముందే క్లారిటీ ఇచ్చేశారు. సినిమాలో కింగ్ నాగార్జున రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గా ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు.

ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. మొన్నటి వరకు బ్యాంకాక్ లో సుదీర్ఘ షెడ్యూల్ ని చిత్ర యూనిట్ కంప్లీట్ చేసుకొని వచ్చింది. మరల ఇప్పుడు ముంబైలో కొత్త షెడ్యూల్ ని శేఖర్ కమ్ముల స్టార్ట్ చేశారు. దీనికి సంబందించిన చిత్ర యూనిట్ ఒక పోస్టర్ తో క్లారిటీ ఇచ్చింది. మాసివ్ ముంబై చాప్టర్ కిక్ ఆఫ్ అంటూ పోస్టర్ లో పేర్కొంది.

ఈ పోస్టర్ లో ధనుష్ ఒక పైప్ లైన్ పై నిలబడి సిటీ వైపు చూస్తున్నట్లు స్టిల్ ఉంది. 12 రోజుల పాటు ముంబై షెడ్యూల్ ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ షెడ్యూల్ లో హీరోయిన్ రష్మిక మందన్న కూడా పాల్గొంటుందని కన్ఫర్మ్ చేశారు. కీలకమైన టాకీ పార్ట్స్ తో పాటు కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ని కూడా ముంబై బ్యాక్ డ్రాప్ లో షూట్ చేయబోతున్నారంట.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా నిర్మిస్తున్నారు. ఏషియన్ గ్రూప్, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాయి. ఇంతకాలం క్లాస్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల తనలో మాస్ టచ్ ని కుభేరతో బయటకి తీయబోతున్నాడంట.

దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ధనుష్ కెరియర్ లో బెస్ట్ మూవీస్ లలో ఇది కూడా ఒకటి అవుతుందని చిత్ర యూనిట్ బలంగా నమ్ముతుంది. ఈ ఏడాదిలోనే మూవీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చిత్ర యూనిట్ చెప్పింది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోన్న నేపథ్యంలో ఈ ఏడాది ఆఖరులో కుభేర ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.