Begin typing your search above and press return to search.

కుబేర : నాగార్జున హిట్‌... ధనుష్‌ ఫ్లాప్‌

తమిళ స్టార్‌ నటుడు ధనుష్‌ హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొంది గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'కుబేర'.

By:  Tupaki Desk   |   28 Jun 2025 10:30 AM IST
కుబేర : నాగార్జున హిట్‌... ధనుష్‌ ఫ్లాప్‌
X

తమిళ స్టార్‌ నటుడు ధనుష్‌ హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొంది గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'కుబేర'. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా, నాగార్జున కీలక పాత్రలో నటించాడు. తెలుగులో ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ధనుష్ నటించిన ఏ సినిమా కూడా సాధించని వసూళ్లను కుబేర తెలుగు బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది. ఇటీవలే మేకర్స్‌ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో జాయిన్‌ అయినట్లుగా అధికారికంగా ప్రకటన చేశారు. నాగార్జున నటించిన కారణంగా తెలుగు మార్కెట్‌ స్థాయి మరింతగా పెరిగిందని, శేఖర్‌ కమ్ములపై ఉన్న నమ్మకంతో తెలుగు ప్రేక్షకులు సినిమా థియేటర్ల ముందు క్యూ కట్టారని విశ్లేషకుల అభిప్రాయం.

తెలుగు ప్రేక్షకులు నాగార్జున, శేఖర్‌ కమ్ముల, రష్మిక మందన్న కోసం కుబేర సినిమాను చూడాలి అనుకుని ఉంటారని, అందుకే భారీ ఓపెనింగ్స్ నమోదు అయ్యాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సాధించిన విజయం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈమధ్య కాలంలో హిట్ టాక్‌ వచ్చిన సినిమాలు కూడా అంతంత మాత్రమే వసూళ్లు రాబడుతున్నాయి. కానీ కుబేర మాత్రం డ్రై గా ఉన్న బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఒక వైపు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు రాబడుతున్న కుబేర సినిమా తమిళనాడులో మాత్రం తీవ్రంగా నిరాశ పరచింది. ధనుష్ సినిమాలు తమిళ్ బాక్సాఫీస్ వద్ద మినిమం వసూళ్లను రాబడుతాయి. కానీ ఈ సినిమా ఆ నెంబర్‌ను చేరుకోలేక పోయింది.

ధనుష్‌ గత చిత్రాలకు పాజిటివ్ రెస్పాన్స్‌ దక్కితే ఫస్ట్‌ వీకెండ్‌కు రూ.25 నుంచి 35 కోట్ల వసూళ్లు నమోదు అయ్యేవి, కొన్ని సినిమాలకు అంతకు మించి వసూళ్లు సాధించిన సందర్భాలు ఉన్నాయి. కానీ కుబేర మొదటి వీక్ పూర్తి అయ్యే ప్పటి వరకు రూ.20 కోట్ల మార్క్‌ వద్దే ఉందని సమాచారం. కుబేర సినిమాను తమిళ ప్రేక్షకులు ఆశించిన రేంజ్‌లో ఆధరించడం లేదు. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను చూస్తారా అనే అనుమానం మొదట వ్యక్తం అయింది. కానీ తెలుగు స్టార్స్‌, ఫిల్మ్‌ మేకర్‌ తెలుగు వ్యక్తి కావడం వల్ల కుబేర కు అత్యధిక వసూళ్లు నమోదు అయ్యాయి, పైగా సినిమాకు పాజిటివ్ టాక్‌ రావడం వల్ల వంద కోట్ల మార్క్‌ను క్రాస్‌ చేసిందని బాక్సాఫీస్‌ వర్గాల వారు అంటున్నారు.

ఈ మధ్య కాలంలో తమిళ హీరోలు తెలుగు సినిమాలను చేయడం, తెలుగు దర్శకులు తమిళ సినిమాలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఆ ప్రాజెక్ట్‌ల్లో ఏది కూడా ఈ స్థాయిలో తెలుగు బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సాధించిన దాఖలాలు లేవు. శేఖర్‌ కమ్ముల మార్క్‌ మేకింగ్‌కు తెలుగు ప్రేక్షకులు మరోసారి ఫిదా అయ్యారు. యూఎస్‌లోనూ ఈ సినిమా తెలుగు వర్షన్‌ అత్యధికంగా వసూళ్లు రాబడుతూ దూసుకు పోతుంది. రెండో వారంలోనూ సాలిడ్ కలెక్షన్స్‌ నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది. కన్నప్ప సినిమా విడుదల తర్వాత కుబేర తగ్గుతుందని భావించిన వారికి షాక్ ఇచ్చింది. కన్నప్ప సినిమా రిలీజ్ అయిన రోజు, తర్వాత రోజు కూడా కుబేరకు సాలిడ్‌ కలెక్షన్స్ నమోదు అయ్యాయి. నాగార్జున ఫ్యాన్స్‌ ఈ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.