శేఖర్ కమ్ముల వాట్సాప్ ఎందుకు వాడరు..?
స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమా తర్వాత కుబేర సినిమా చేశారు. ధనుష్ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమాలో కింగ్ నాగార్జున కూడా స్పెషల్ రోల్ చేశారు.
By: Tupaki Desk | 19 Jun 2025 10:08 PM ISTస్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమా తర్వాత కుబేర సినిమా చేశారు. ధనుష్ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమాలో కింగ్ నాగార్జున కూడా స్పెషల్ రోల్ చేశారు. ఇప్పటివరకు ఒక క్యూట్ లవ్ స్టోరీలు మాత్రమే చేసిన శేఖర్ కమ్ముల మొదటిసారి ఒక భారీ ప్రాజెక్ట్ తో వస్తున్నారు. కుబేర సినిమాపై శేఖర్ కమ్ముల నమ్మకం కూడా చాలా బాగుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో నాగార్జునతో పాటు శేఖర్ కమ్ముల నాగ చైతన్యతో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల సినిమాల గురించి ఆయన వర్కింగ్ స్టైల్ గురించి తన ఎక్స్ పీరియన్స్ చెప్పాడు నాగ చైతన్య. ఇక ఈ క్రమంలోనే నాగ చైతన్య శేఖర్ కమ్ముల ఇప్పటికైనా వాట్సాప్ వాడుతున్నారా అని అడిగితే లేదని అన్నారు. శేఖర్ కమ్ముల వాట్సాప్ ఇంకా సోషల్ మీడియా వాడరని చైతు అన్నాడు.
దానికి సమాధానం ఇస్తూ నాగ చైతన్య దీనికి రీజన్ అని అన్నారు. నాగార్జున కూడా తనకు ఫోన్ కలవదని మెసేజ్ చేయమని అంటానని అన్నాడు. ఐతే శేఖర్ కమ్ముల వాట్సాప్ ఎందుకు వాడరన్నది ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. మరి ఆయన మొదటి నుంచి అంతేనా లేదా మధ్యలో అలా చేశారా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇలా వాట్సాప్ సోషల్ మీడియాలకు దూరంగా ఉండటం అన్నది సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు.
ఇక శేఖర్ కమ్ముల కుబేర సినిమా గురించి చెబుతూ ఈ కథే అందులోని పాత్రలని ఎంపిక చేసిందని.. ఇంత బాగా వచ్చింది అంటే కథ కోరిందని అన్నారు. సినిమాపై తాను చాలా నమ్మకంగా ఉన్నట్టు వెల్లడించారు శేఖర్ కమ్ముల. కుబేర కథ రాసుకున్న టైం లోనే ఈ కథలో లీడ్ రోల్ ధనుష్ అయితే బాగుంటుందని అనుకున్నారట శేఖర్ కమ్ముల. ఐతే కథలో ఇంకో బలమైన పాత్ర కుదరగా దానికి కూడా నాగార్జున పర్ఫెక్ట్ అనుకోగా ఆయన ఒప్పుకుంటారా లేరా అన్న డౌట్ ఉండేదని.. ఐతే కథ చెప్పగానే నాగ్ సార్ కూడా ఓకే అన్నారని కుబేర ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో చెప్పారు శేఖర్ కమ్ముల.
ఇక కుబేర సినిమాలో రష్మిక కూడా మరో హైలెట్ కానుందని తెలుస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా సినిమాకు సూపర్ హైప్ తెచ్చింది.
