రష్మిక రౌడీ గురించి పూర్తిగా ఓపెన్ అయినట్టేనా?
ఆదివారం జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సుమ అడిగిన ప్రశ్నకు రష్మిక మందన్న చెప్పిన సమాధానం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
By: Tupaki Desk | 16 Jun 2025 7:34 AMతమిళ స్టార్ ధనుష్ హీరోగా రూపొందిన మూవీ 'కుబేర'. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ని నిర్మించారు. కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న తొలిసారి ధనుష్‌కు జోడీగా నటించింది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్ని ఈ మూవీని మరో నాలుగు రోజుల్లో అంటే జూన్ 20న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రిలీజ్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో టీమ్ ప్రమోషన్స్‌ని స్పీడప్ చేసింది.
ఇందులో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో హీరో ధనుష్, కింగ్ నాగార్జునతో పాటు హీరోయిన్ రష్మిక మందన్న కూడా పాల్గొంది. సినిమా రిలీజ్‌కు టైమ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో రష్మిక కూడా ఈ మూవీ ప్రమోషన్స్‌లో పుల్ యాక్టీవ్‌గా పాల్గొంటోంది. ఆదివారం జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సుమ అడిగిన ప్రశ్నకు రష్మిక మందన్న చెప్పిన సమాధానం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ ఈవెంట్‌లో పాల్గొన్న స్టార్స్‌ని యాంకర్ సుమ రాండమ్‌గా కొన్ని ప్రశ్నలు వేసింది. అలాగే రష్మికని కూడా అడిగింది. నాగార్జున విషయంలో మిమ్మల్ని ఆకర్షించే అంశం ఏంటని అడిగితే 'ఆయన ఛార్మ్' అని తెలిపింది. ఇక ధనుష్ విషయంలో అని ప్రశ్నిస్తే.. ఆయన నుంచి డైరెక్షన్, రైటింగ్, సింగింగ్, మ్యూజిక్ కంపోజింగ్ వంటి క్వాలిటీస్‌ని తీసుకుంటానని చెప్పింది. అల్లు అర్జున్ గురించి ఏం చెబుతారని అడిగితే ఆయ స్వాగ్ అని బదులిచ్చింది.
ఫైనల్‌గా ఏది అయితే అడగాలో అదే అడిగింది సుమ.. విజయ్ దేవరకొండలో ఏ విషయాన్ని ఇష్టపడతారని అడిగితే తన నుంచి మొత్తం తీసుకుంటానని, ఎవ్రీథింగ్ అంటూ నవ్వేసింది. రష్మిక మాటలు విన్న ప్రేక్షకుల అరుపులు, కేకలతో ఆడిటోరియం అంతా అరుపులు కేకలతో మారుమోగింది. అంటే రష్మిక మందన్న ఈ ఆన్సర్‌తో పూర్తిగా ఓపెన్ అయినట్టుగా క్లారిటీ వచ్చేసింది. గత కొంత కాలంగా రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల మధ్య ఏదో జరుగుతోందని, ఇద్దరు లవ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అప్పుడప్పుడు ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ స్పెషల్ వెకేషన్‌లకు సంబంధించిన ఫొటోలు లీక్ కావడం తెలిసిందే. తాజాగా విజయ్ దేవరకొండపై తన అభిప్రాయాన్ని రష్మిక ఓపెన్‌గా చెప్పడంతో రౌడీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవతున్నారట.