రష్మిక రూ.వందల కోట్ల హీరోయిన్!: కుబేర నిర్మాతలు
నాగార్జున, ధనుష్, రష్మిక లీడ్ రోల్స్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన సినిమా కుబేర.
By: Tupaki Desk | 16 Jun 2025 7:37 AMనాగార్జున, ధనుష్, రష్మిక లీడ్ రోల్స్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన సినిమా కుబేర. అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, SVC LLPపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించారు. ఇప్పుడు తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత రామ్మోహన్ రావు మాట్లాడారు.
శేఖర్ కమ్ముల గారు ఒక డిఫరెంట్ స్టైల్ లో సినిమాలు తీసే అద్భుతమైన ఫిల్మ్ మేకర్ అని తెలిపారు. కుబేర మూవీ అంతే డిఫరెంట్ గా వేరే జానర్ లో తీశారని చెప్పారు. థ్రిల్లర్, క్రైమ్, సస్పెన్షన్ అన్ని ఎలిమెంట్స్ ను ఆడియన్స్ చూడబోతున్నారని చెప్పారు. శేఖర్ కమ్ముల గారి సినిమాల్లో ఇది చాలా డిఫరెంట్ గా ఉండబోతుందన్నారు.
"ధనుష్ గారు ఫెంటాస్టిక్ గా పెర్ఫామ్ చేశారు. ఆయన ఆల్ రౌండర్. నాగార్జున గారు ఎంతో స్పెషల్. మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. మా సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. ఆయన పెర్ఫార్మన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. 300 కోట్ల హీరోయిన్ రష్మిక మా మూవీలో ఉన్నారు. దేవిశ్రీ ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు. డైరెక్షన్, ప్రొడక్షన్ టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు" అని నిర్మాత తెలిపారు.
లిరిక్ రైటర్ నందకిషోర్ మాట్లాడుతూ.. శేఖర్ గారి సినిమా కోసం పాటలు రాయడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. "ఈ జర్నీలో చాలా విషయాలు నేర్చుకున్నాను. దేవిశ్రీప్రసాద్ గారి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సినిమా తప్పకుండా చూడండి" అని అన్నారు.
లిరిక్ రైటర్ భాస్కర్ భట్ల మాట్లాడుతూ.. లవ్ స్టోరీ తర్వాత శేఖర్ కమ్ముల గారితో ఇది రెండో అవకాశమని చెప్పారు. "శేఖర్ గారు, దేవి శ్రీ ప్రసాద్ గారి స్టైల్ ను క్లబ్ చేయడానికి చాలా టైమ్ పట్టింది. రిజల్ట్ అద్భుతంగా వచ్చింది. క్యాస్టింగ్ అందరికీ ధన్యవాదాలు. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.
ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి మాట్లాడుతూ.. శేఖర్ కమ్ముల గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంటుందని తెలిపారు. "చాలా వండర్ ఫుల్ టీమ్ తో కలిసి చేసిన సినిమా ఇది. అద్భుతంగా వచ్చింది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది" అని తోట తరణి ఆశాభావం వ్యక్తం చేశారు. మరి సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.