కుబేర అతి పెద్ద సవాలు అనిపించింది అదే : శేఖర్ కమ్ముల
హ్యాపీడేస్ సినిమాతో యూత్ ఆడియన్స్ కి ఒక మెమరబుల్ గిఫ్ట్ ఇచ్చిన శేఖర్ కమ్ముల తన ప్రతి సినిమాతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు.
By: Tupaki Desk | 18 Jun 2025 5:13 PM ISTహ్యాపీడేస్ సినిమాతో యూత్ ఆడియన్స్ కి ఒక మెమరబుల్ గిఫ్ట్ ఇచ్చిన శేఖర్ కమ్ముల తన ప్రతి సినిమాతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. లవ్ స్టోరీ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల ధనుష్ హీరోగా కుబేర సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాలో కింగ్ నాగార్జున కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తున్న కుబేర గురించి డైరెక్టర్ శేఖర్ కమ్ముల మరిన్ని విషయాలు మీడియాతో పంచుకున్నారు.
కుబేర కథ స్పూర్తి ఏంటని అడగ్గా.. ప్రపంచంలో బాగా డబ్బున్న వ్యక్తికి.. ఏమీ లేని పేదవాడికి మధ్య జరిగే పోరాటాన్ని సినిమాగా తీయాలని అనిపించింది. అది చాలా పెద్ద పాయింటే అయినా జాగ్రత్తగా రాసుకున్నా.. కుబేర గురించి ఒక్క మాటలో చెప్పాలంటే బిలీనియర్ వర్సెస్ బెగ్గర్ కథ అని అన్నారు శేఖర్ కమ్ముల. ఇలాంటి కథ చెప్పాల్సిన అవసరం ఉంది.. ఈ సినిమాను తీసినందుకు సంతోషంగా ఉందని అన్నారు. కుబేరలో రెండు ప్రపంచాలు ఉంటాయి. సినిమా చూసి ప్రేక్షకుల్లో మార్పు వస్తుందని అన్నారు శేఖర్ కమ్ముల.
కుబేర సినిమాలో పొలిటికల్ యాంగిల్ గురించి శేఖర్ కమ్ముల ప్రస్తావిస్తూ.. సినిమాలో రాజకీయ కోణం ఉంటుంది. ఐతే సందర్భానికి అనుగుణంగా సీన్స్ ఉంటాయని అన్నారు. ఇక సినిమాలో నాగార్జున పాత్ర గురించి చెబుతూ కొన్ని పాత్రలు నాగార్జున మాత్రమే చేయగలరు. కథ రాసుకునే టైం లోనే నాగార్జున అయితే బాగుంటారని అనిపించింది. ఆయన్ను ఇప్పటికే చాలా రోల్స్ లో చూశాం కుబేరలో కొత్తగా కనిపిస్తారని అన్నారు శేఖర్ కమ్ముల.
ధనుష్ హీరోగా ఎంపిక చేసుకోవడం గురించి చెబుతూ.. కుబేర చూశాక అది అర్ధమవుతుందని అన్నారు. ధనుష్ మాత్రమే ఇలాంటి రోల్స్ చేయగలరు. ఆయన అద్భుతంగా చేశారు. మరొకరిని ఈ పాత్రలో ఊహించలేమని అన్నారు. ఇలాంటి కథను ఓకే చేయడమే గొప్ప విషయమని.. ధనుష్ స్వతహాగా డైరెక్టర్ కాట్టి కథ చెప్పే టైం లో కాస్త భయపడ్డానని అన్నారు శేఖర్ కమ్ముల.
కుబేరలో శేఖర్ కమ్ముల మార్క్ గురించి ప్రస్తావిస్తూ.. ఇది లవ్ స్టోరీ కాదు.. సినిమా చూసి అందరు షాక్ అవుతారు. నా గత సినిమాలన్నిటి కన్నా ఇది పది రెట్లు గొప్పగా ఉంటుందని అన్నారు. కుబేరకు దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ అదిరిపోయిందని అన్నారు శేఖర్ కమ్ముల.
కుబేర విషయంలో సవాలుగా అనిపించిన అంశపై శేఖర్ కమ్ముల చెబుతూ.. సినిమా ఎక్కువ శాతం ముంబైలో చేశా. అక్కడ చాలా రష్ ఉంటుంది. ఒకచోట నుంచి మరోచోటికి వెళ్లడానికి చాలా టైం పట్టేదని.. పర్మిషన్స్ కూడా అంత ఈజీగా దొరకవని అన్నారు శేఖర్ కమ్ముల.
సినిమాను ఎక్కువ కాలం చేశాడన్న రాజమౌళి కామెంట్స్ పై స్పందిస్తూ.. ఈ సినిమాలో ఎక్కువ మంది స్టార్స్ ఉండటం వల్ల కాస్త ఎక్కువ టైం తీసుకున్నా.. వాళ్ల డేట్స్ ప్రకారం షెడ్యూల్ మార్పులు వచ్చాయని అన్నారు శేఖర్ కమ్ముల. తన పాతికేళ్ల కెరీర్ లో పెద్దగా ఎదురుదెబ్బలు తగల్లేదు. ఎప్పుడు సింపుల్ గా ఉంటాను కాబట్టి సినిమాలు కూడా అలానే తీశాను. ఆడియన్స్ నాపై ఎంతో అభిమానం చూపించారు. వారందరికీ కృతజ్ఞతలు.. ఈ జర్నీ గురించి ఆలోచిస్తే చాలా ఎమోషనల్ అవుతా అన్నారు శేఖర్ కమ్ముల. అంతేకాదు కెరీర్ లో పెద్దగా బాధ పడిన సందర్భాలు లేవని.. ఎప్పుడు ఏది ఆశించలేదు. నా పారితోషికం తీసుకుని సినిమాలు చేశా.. అయితే కొన్నిసార్లు నష్టపోయా.. ఐతే వాటికన్నా ఆడియన్స్ లో ప్రేమ ముఖ్యమని అనుకున్నా అన్నారు శేఖర్ కమ్ముల.
లీడర్ సీక్వెల్ గురించి చెబుతూ.. లీడర్ సీక్వెల్ చేయొచ్చు కానీ అప్పటి పరిస్థితులకు ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి. ప్రేక్షకుల అభిరుచి కూడా మారిందని అన్నారు శేఖర్ కమ్ముల. ఇక నానితో కథా చర్చలు జరిగాయని.. ఆ వర్క్ జరుగుతుంది ఆ ప్రాజెక్ట్ కి ఇంకా టైం ఉందని అన్నారు శేఖర్ కమ్ముల.
